ప్రధాని మోదీ దేశంలో లాక్ డౌన్ ప్రకటించక ముందు దేశంలో 600 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. లాక్ డౌన్ ప్రకటించిన తరువాత కూడా తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ఎప్పుడైతే మర్కజ్ ప్రార్థనల ద్వారా కరోనా విజృంభించిందో దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మర్కజ్ ప్రార్థనల ద్వారా కరోనా వ్యాప్తి జరిగినట్లు ఆలస్యంగా గుర్తించడంతో అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 
 
మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారి ద్వారా కరోనా వైరస్ దేశంలో వేగంగా వ్యాప్తి చెందింది. ఢిల్లీలో జరిగిన ఈ సదస్సుకు వేల సంఖ్యలో విదేశాల నుంచి హాజరయ్యారు. అధికారులు విదేశాల నుంచి సదస్సుకు హాజరైన వారి నుంచే కరోనా వ్యాప్తి చెందిందని నిర్ధారించారు. ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకుండా వైరస్ వ్యాప్తికి కారణమైన తబ్లీగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. 
 
ఐపీసీ 304 ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యాడనే కారణంతో పోలీసులు సాద్ పై కేసు నమోదు చేశారు. మౌలానా సాద్ సెల్ఫ్ క్వారంటైన్ పూర్తి కావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు గతంలోనే రెండు సార్లు సాద్ కు నోటీసులు పంపారు. అనేక రాష్ట్రాల్లో జమాతే సభ్యుల ద్వారానే కరోనా సోకినట్లు గుర్తించారు. 
 
ఢిల్లీ పోలీసులు తబ్లీగీ జమాతే కార్యాలయంలో తనిఖీలు చేసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలే కారణం అని చెప్పవచ్చు. ఏపీలోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో నూరుకు పైగా కేసులు నమోదు కావడానికి మర్కజ్ ప్రార్థనలే కారణమని అధికారులే ప్రకటనలు చేయడం గమనార్హం.    

మరింత సమాచారం తెలుసుకోండి: