ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూ ఉండగా రోజు రోజుకి పదుల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 525 మంది కరోనా బారిన పడగా వారిలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఇక కోలుకున్న వారి సంఖ్య 20 కన్నా తక్కువగా ఉండడం కూడా కలవరపరిచే విషయమే. నేపథ్యంలో ఏపీలో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఐదు మాస్కులు అందజేయాలని మరియు డోర్ టు డోర్ కరోనా నిర్ధారణ టెస్టులు చేయాలని ఆదేశించినా కూడా కేసులు తగ్గుముఖం పట్టకపోవడం గమనార్హం.

 

అయితే ప్రస్తుతం జగన్ మరియు అతని కుటుంబం నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మన రాష్ట్రంలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 122 కరోన కేసులు నమోదు కాగా అందులో చాలా ప్రదేశాలు రెడ్ జోన్ లుగా గా ఉన్నాయి. కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించగా దానికి మూడు కిలోమీటర్ల లో ఉన్న ప్రాంతాన్ని క్లస్టర్ కంటైన్ మెంట్ గా ప్రకటిస్తారు. క్లస్టర్ కంటైన్మెంట్ కు ఏడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని బఫర్ జోన్ గా ప్రకటిస్తారు. గుంటూరులో ఉన్న ఒక బఫర్ కోన్ లో ముఖ్యమంత్రి జగన్ మరియు అతని కుటుంబం కూడా నివాసం ఉండడంతో ఇప్పుడు జిల్లాలో చర్యలు మరింత పటిష్టం చేశారు.

 

ఇకపోతే బఫర్ జోన్ లో తన నివాసం వెళ్లడం తో ముఖ్యమంత్రి జగన్ కూడా అధికారులకు సహకరిస్తున్నారు. బఫర్ జోన్లో ఏమేమి చర్యలు తీసుకోవాల్నో అన్ని చర్యలను తీసుకోవాలని సీఎం జగన్ సూచిస్తున్నారు. అందుకనుగుణంగా తన షెడ్యూల్ మార్చుకోవడంతో పాటు తాను ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. అయితే బఫర్ జోన్లోనికి ముఖ్యమంత్రి నివాసం వెళ్లడం తో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: