అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగిందంతా మన మంచికే అనుకుని సాగడమే మనిషి పనీ.. అన్నాడో సినీ కవి. అవును.. అంతా మనం అనుకున్నట్టే జరగదు.. అంతమాత్రాన నిరుత్సాహం వద్దు.. నిరాశ అసలే వద్దు.

 

 

జీవితం అన్నాక గెలుపూ ఓటమీ రెండూ ఉంటాయి. రెండింటినీ సమంగా చూడగల జీవన సామర్థ్యం చాలా అవసరం. మామూలు సమయాల్లో కంటే ఇప్పుడు కరోనా వంటి కష్టకాలాల్లో ఈ సామర్థ్యం ఇంకాస్త ఎక్కువ అవసరం. అవును.. ముందుగా కరోనా కేవలం 21 రోజులు అనే చెప్పారు.

 

 

ఇప్పుడు మరో 19 రోజులు అంటున్నారు. తప్పదు.. ఇంట్లో ఏంచేయాలో బోరు కొడుతోంది అంటూ నెర్వస్ గా ఫీలైతే ఎలా.. కొందరు ఇంతే.. తమ జీవితంలో ఏమాత్రం మార్పు వచ్చినా తట్టుకోలేరు. తమకు అందుతున్న సౌకర్యాల్లో ఏ ఒక్కటి తగ్గినా తెగ మథనపడిపోతారు. అనుకూలంగా సాగిపోతున్న జీవనంలో చిన్న ప్రతికూలత వచ్చినా తట్టుకోలేరు.

 

 

కానీ.. ఇలాంటప్పుడే కదా.. నీ సత్తా బయటపడేది. కొత్త కోర్సులు నేర్చుకో.. మర్చిపోయిన పాత స్నేహితులను గుర్తు తెచ్చుకుని పలకరించు.. ఎన్నడూ మాట్లాడని నీ పిల్లలతో కాస్త గడువు. వాళ్లు ఎలా చదువుతున్నారో.. ఏం చేస్తున్నారో వాళ్ల అభిరుచులేంటో తెలుసుకో. జీవితానికి ఈ లాక్ డౌన్ ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించు. అమలు చేయి.. అంతే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: