దేశంలో కరోనా బాధితుల సంఖ్య గంటగంటకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ కు కరోనా పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. ఒక పిజ్జా తినాలనే కోరిక 72 కుటుంబాలు సెల్ఫ్ క్వారంటైన్ కు పరిమితం కావడానికి కారణమైంది. ఢిల్లీ దక్షిణ జిల్లాలో ఒక పిజ్జా డెలివరీ సంస్థ నుంచి రెండు రోజుల క్రితం కొందరు పిజ్జాలు తెప్పించుకున్నారు. 
 
తాజాగా పిజ్జా డెలివరీ బాయ్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో పిజ్జా డెలివరీ బాయ్ ను అతనితో పాటు పని చేసే 16 మంది డెలివరీ బాయ్ లను, ఆ వ్యక్తి పిజ్జా డెలివరీ చేసిన 72 కుటుంబాలను క్వారంటైన్ లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. ఒక పిజ్జాకు ఆశపడిన వాళ్లంతా ఇప్పుడు హోం క్వారంటైన్ కు పరిమితం కావాల్సి వచ్చింది. సీనియర్ జర్నలిస్ట్, ఇండియా టీవీ న్యూస్ డైరెక్టర్ రాహుల్ కన్వాల్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ లకు దూరంగా ఉండాలని సూచించారు. 
 
రాహుల్ కన్వాల్ ట్విట్టర్ లో ఈరోజు చాలా ఆందోళన కలిగించే ఘటన చోటు చేసుకుందని అన్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో పిజ్జా ఆర్డర్ చేయడం ఎంతవరకు సురక్షితం అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 72 కుటుంబాలు క్వారంటైన్ కు వెళ్లిన ఘటన చర్చనీయాంశమైంది. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఆన్ లైన్ ఫుడ్ కు దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12,759కు చేరింది. తెలంగాణలో 700 కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో 534 కేసులు నమోదయ్యాయి. ఏపీలో గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తెలంగాణలో హైదరాబాద్ లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు నమోదైన కేసులలో ఎక్కువగా జీ.హెచ్.ఎం.సీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: