రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడు మనసు విధంగా,  ఏ సందర్భంలో మారుతుందో చెప్పలేము. ప్రస్తుతం ఏపీలో కరోనా హడావిడిలో జనాలు ఉన్నారు. రాజకీయ పార్టీలు కూడా కరోనా కు సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టాయి. ప్రతిపక్షం, అధికార పార్టీ ఇలా అందరూ కరోనా కి సంబంధించి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఓ ఏపీ ఎమ్మెల్యే పేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్టింగ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ఆయనే గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ అతి కొద్ది కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. గన్నవరం నుంచి 2019 ఎన్నికల్లో గెలుపొందారు. ఇక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసిపికి అనుబంధంగా కొనసాగుతున్నారు. ఒకటి రెండు పర్యాయాలు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. 


అలాగే అనేక మీడియా సమావేశాల్లోనూ, అసెంబ్లీలోనూ టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్ ను ఉద్దేశించి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వంశీ అధికారికంగా వైసీపీలో చేరకపోయినా, అనుబంధ సభ్యుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా, ఈరోజు ఆయన ఫేస్ బుక్ లో చేసిన ఒక రాజకీయ పోస్ట్ సంచలనంగా మారింది. ''14 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నా కష్టసుఖాలలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని వంశీ పోస్ట్ చేశారు. 


అయితే అసలు వంశీ ఎందుకు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అనే విషయంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వంశీ ఫేస్ బుక్ పెట్టిన పోస్ట్ ను బట్టి చూస్తుంటే ఆయన శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పే ఆలోచనలో ఉన్నట్లుగా అర్థం అవుతోంది. ప్రస్తుతం రాజకీయంగా ఏ వ్యవహారాలు యాక్టివ్ గా ఏ పార్టీ చేయడం లేదు. అసలు కొద్దిరోజులుగా వంశీ ప్రస్తావన కూడా ఏపీ రాజకీయాల్లో పెద్దగా లేదు. అయితే అనూహ్యంగా ఆయన ఈ విధంగా పోస్ట్ పెట్టడం పై ఆయన అభిమానులకు కూడా అంతు పట్టడం లేదు. ఇదే  విషయమై వంశీని ఆరా తీసేందుకు ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రయత్నిస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: