లాక్‌డౌన్ కార‌ణంగా క‌రోనా వైర‌ష్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయ‌డం సాధ్యం అవుతున్న‌ప్ప‌టికీ...మ‌రోవైపు ఇంకో కోణం ప‌లువురిని ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా  వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన ప్రజల ఆందోళనలు పెరుగుతున్నాయి. ఓ పక్క వలస కార్మికులు తమను సొంత గ్రామాలకు వెళ్ళేలా చూడాలంటూ నిరసనలకు దిగుతుంటే... మ‌రోవైపు ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. 20 రోజులుగా తాము తిండిలేక పస్తులుంటున్నాం... ఎలా బతకాలంటూ పశ్చిమ బెంగాల్‌లోని జాతీయ రహదారిపై 400 కుటుంబాల వారు ధర్నాకు దిగిన ఉదంతం స‌భ్య స‌మాజాన్ని ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది.

 

పేదలకు ఉచితంగా రేషన్‌ అందిస్తామని ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మాటలు వట్టిదేననీ, గత 20రోజులుగా తిండి లేక పస్తులుంటున్నామని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ ముర్షిదాబాద్‌ జిల్లా దోమకల్‌ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై 400 కుటుంబాలు బైఠాయించడంతో మూడు గంటల పాటు ఆ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. మా ప్రాంతంలో కుటుంబంలో మనిషికి కేవలం కిలో బియ్యం మాత్రమే లెక్కకట్టి ఇచ్చారనీ, నలుగురైదుగురు ఉన్న కుటుంబానికి అవి ఏం సరిపోతాయని వారు ప్రశ్నించారురు. ఇక్కడ అత్యధికమంది కూలీలు. బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జీవనోపాధి పొందుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా తమకు పనుల్లేకుండా పోయాయనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తామని చెబుతున్నారనీ, కానీ, అది జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశాడు.

 

కాగా,  పిల్లలు, పెద్దలు సుమారు 400 కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో పోలీసులు, అధికారులు షాకయ్యారు. సమాచారం తెలుసుకున్న దోమకల్‌ మున్సిపాలిటీ చైర్మెన్‌ హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగిన ప్రజలకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. '1.57లక్షల మంది ప్రజలు దోమకల్‌ మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నారు. ఇందులో 69శాతం మంది దారిద్రరేఖకు దిగువన ఉన్నవారే. ప్రభుత్వం నుంచి మాకు 42 క్వింటాళ్ల బియ్యం మాత్రమే వచ్చాయి. మరిన్ని క్వింటాళ్ల బియ్యం త్వరలోనే వస్తాయి. రేషన్‌ సరిగా ఇవ్వని డీలర్లపై చర్యలు తీసుకుంటాం' అని దోమకల్‌ మున్సిపాలిటీ ఛైర్మన్‌ జఫికల్‌ ఇస్లామీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: