ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేక మందిని బలి తీసుకుంటుంది. అమెరికా మరియు యూరప్ దేశాలలో వైరస్ ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉంది. లక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా వేల సంఖ్యలో కరోనా వైరస్ మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికాలో అయితే కరోనా వైరస్ మరణ విలయ తాండవం చేస్తుంది. ఎవరూ ఊహించని రీతిలో లక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దాదాపు 200 దేశాలకు పైగా నే వ్యాపించి ఉన్న ఈ వైరస్ ని అరికట్టడానికి మందు లేకపోవడంతో నివారణ నియంత్రణ ఒకటే కావడంతో చాలా వరకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.

 

అయితే కరోనా వైరస్ వల్ల మనిషి ప్రాణానికి ముప్పు గా ఉన్నా గాని మరోపక్క కాలుష్యం అయిపోయిన వాతావరణాన్ని సెట్ రైట్ చేస్తోంది. చాలావరకూ కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాలుష్యం మొత్తం తగ్గిపోయిందనే వాతావరణ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భారతదేశం వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని ఈ ఏడాది వర్షాలు అధికంగా పడతాయని వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ ఏడాది పంటలు వేసిన రైతులు చాలా విధంగా లాభ పడటం గ్యారెంటీ అని వ్యాఖ్యానిస్తున్నారు.

 

ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు చాలా తొందరగా అనగా మే చివరి వారంలో కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారటంతో రోడ్డులు అన్ని నిర్మానుష్యంగా మారటంతో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎప్పుడూ లేని స్థాయిలో క్షీణించడంతో వర్షాకాల సీజన్ కాస్త ముందే రావొచ్చని వాతావరణ విభాగం అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆశించిన దానికంటే ఎక్కువగానే వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ విధంగా ప్రకృతికి మేలు చేస్తూ కరోనా వైరస్ ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ అందించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: