కరోనా వైరస్ ని కట్టడి చేయడం విషయంలో 'WHO' ముందుండి అందరిని అప్రమత్తం చేస్తోంది. ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఎప్పుడు ఏ విధంగా ఈ వైరస్ విషయంలో వ్యవహరించాలో అనేక సూచనలు ఇస్తుంది. అంతే కాకుండా ఈ కరోనా వైరస్ భూమి మీద ఉన్న అన్ని వైరాస్ లా కంటే 10 శాతం ప్రమాదకరమని తెలిపింది. వ్యాక్సిన్ వచ్చేవరకూ నియంత్రణ ఒకటే మార్గమని తెలియజేస్తూ లాక్ డౌన్ అమలు చేయాలని వైరస్ తీవ్రత బట్టి ఆదేశాలు ఇస్తుంది. అంతేకాకుండా సోషల్ డిస్టెన్స్ మరియు హ్యాండ్ వాష్ గురించి అనేక సూచనలు ప్రపంచ దేశాలకు తెలియజేస్తుంది.

 

ఇటువంటి తరుణంలో ప్రపంచంలో ఉన్న ప్రజలంతా లాక్ డౌన్ వల్ల ఇళ్లకే పరిమితం కావడంతో...చాలామంది మద్యం సేవిస్తూ గొడవలు పడుతున్నట్లు వార్తలు అంతర్జాతీయస్థాయిలో రావడంతో మందు విషయం లో కూడా 'WHO' అనేక సూచనలు ప్రపంచ దేశాలకు ఇచ్చింది. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించింది. మందు తాగడం వల్ల మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతోందని...కనుక మద్యం అమ్మే దేశాలు వెంటనే చర్యలు తీసుకుని మద్యం తప్పకుండా చూడాలని సూచించింది.

 

అందరూ ఒకే ఇంటిలో ఉన్న సమయంలో..ఈ విధంగా మందు తాగి గొడవలు పడటం కూడా సమంజసం కాదని..మందుబాబులకు మందు మానేయాలని 'WHO' తెలిపింది. దేశాల నేతలు తమ ప్రభుత్వాలను అదుపులో పెట్టుకుని ప్రజలకు మద్యం అందుబాటులో ఉండకుండా చేయాలని మద్యం నియంత్రించాలని సూచనలు చేసింది.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: