ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లెటర్ కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశపూర్వకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారని అప్పట్లో...రమేష్ కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం పై వైసీపీ నేతలు ఆరోపించడం జరిగింది. చంద్రబాబు దర్శకత్వంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని స్వయంగా సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేయడం అప్పట్లో మనకందరికీ తెలిసినదే. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరిట కేంద్ర హోంశాఖ కి ఓ లెటర్ వెళ్ళటం...ఆ లెటర్లో ఏపీ ప్రభుత్వంపై అలాగే ముఖ్యమంత్రిపై దారుణమైన వ్యాఖ్యలు చేయడం దాన్ని టిడిపి నాయకులు చూపించడం పట్ల ఆ లెటర్ అప్పట్లో పెద్ద హైలెట్ అయ్యింది. అసలు ఆ లెటర్ ఎవరు రాశారు అన్న దాని విషయంలో ఎవరికీ క్లారిటీ రాలేదు.

 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఆ సమయంలో ఏం మాట్లాడలేదు. కాగా ఆ లెటర్ లో ఉన్న రమేష్ కుమార్ సంతకం మరియు...స్థానిక సంస్థల ఎన్నికల టైంలో రమేష్ కుమార్ చేసిన సంతకం చాలా తేడాగా ఉండటం తో వెంటనే వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి..లెటర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫోర్జరీ సంతకాల ఉన్నాయని ఈ విషయంపై విచారణ చేయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ నీ కోరడం జరిగింది. ఇటువంటి టైం లో నిమ్మగడ్డ రమేష్ కుమార్లెటర్ తానే రాసినట్లు ఇటీవల ప్రెస్ నోట్ విడుదల చేసారు.

 

అయితే ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా తొందరపడి విజయసాయిరెడ్డి విచారణ అనగానే తానే రాశాను అని ఒప్పుకోవడంతో పెద్ద డ్యామేజ్ రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆ లెటర్ ఎవరు రాశారు అన్న దాని విషయంలో రమేష్ కుమార్ ఏమీ మాట్లాడకుండా ఉంటే...తెలుగుదేశం పార్టీ ఏదో విధంగా కవర్ చేసుకోవటం జరుగుతుంది. ఇలాంటి సమయంలో తానే రాశానని చెప్పటంతో కచ్చితంగా లెటర్ పై విచారణ జరుగుతుందని అప్పుడు అసలు విషయం బయట పడితే పెద్ద డ్యామేజీ రానుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: