ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లెటర్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఒకపక్క కరోనా వైరస్ కేసులు మరోపక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ వార్తలు హాట్ హాట్ గా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికలను పక్కా ప్రణాళికతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ వేసిన స్కెచ్ లో భాగంగా ఎన్నికలను వాయిదా వేసినట్లు అప్పట్లో వైసీపీ నేతలు చేసిన కామెంట్లు మనకందరికీ తెలిసినదే. స్వయంగా సీఎం వైఎస్ జగన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరియు చంద్రబాబు సామాజిక వర్గాలు ఒకటే కావడంతో ఈ విధంగా వ్యవహరించారని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికలు వాయిదా వేసి 14వ ఆర్థిక సంఘం నుండి నిధులు రాకుండా వీళ్లిద్దరూ వ్యవహరించారని సీఎం జగన్ అప్పట్లో షాకింగ్ కామెంట్ లు చేయడం అవి వార్తల లో  హైలెట్ గా నిలవడం మనకందరికీ తెలిసినదే.

 

అయితే ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరిట ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే విధంగా ఓ లెటర్ కేంద్ర హోంశాఖకు వెళ్లింది. ఆ లెటర్ ని చూపించి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏపీ ప్రభుత్వం పై జగన్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయటం అప్పట్లో పెను దుమారాన్నే రేపింది. ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. అసలు ఆ లెటర్ తాను రాసిందో కాదో అన్న విషయాన్ని కూడా ఆ సమయంలో మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు. ఇటువంటి తరుణంలో ఆ లెటర్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన సంతకం అలాగే స్థానిక సంస్థల ఎన్నికల టైంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన సంతకం రెండు డిఫరెంట్ గా ఉండటంతో వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

 

ప్రభుత్వ సంతకాలు ఫోర్జరీ జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తూ దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ నీ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విచారణ కమిటీ వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ లెటర్ ని చూపించి మీడియా సమావేశం నిర్వహించిన టిడిపి నేతలను కూడా విచారణ చేసే అవకాశం ఉందని సమాచారం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ లెటర్ తానే రాసినట్లు ఒప్పుకున్నా గాని...సంతకాలు చాలా డిఫరెంట్ గా ఉండటంతో ఫోర్జరీ నిపుణులు చేత విజయసాయిరెడ్డి విచారణ చేయించాలని ఆలోచిస్తున్నారట. అయితే ఈ విషయంలో టిడిపి నేతలు తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించాలని డిసైడ్ అవుతున్నారట. ఒకవేళ ఈ విధంగానే వ్యవహరిస్తే...నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అతిపెద్ద వెన్నుపోటు... లెటర్ పట్టుకొని మీడియా సమావేశం పెట్టిన టీడీపీ నేతలే చేసినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: