అమెరికా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. మరణాలు చూస్తే వేల సంఖ్యలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల విషయంలో అదేవిధంగా మరణాల ఈ విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మొన్నటివరకూ ఇటలీ మరియు స్పెయిన్ దేశాల్లో ఎక్కువ మరణాలు నమోదు అయ్యేవి. అయితే తాజాగా మాత్రం రెండు దేశాలను వెనక్కినెట్టి అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో ప్రాణ నష్టంతో పాటు ఆర్థికంగా కూడా కరోనా వైరస్ వల్ల భారీ మూల్యం చెల్లించు కుంటుంది. అయితే దీనంతటికి కారణం డోనాల్డ్ ట్రంప్ టెంపర్ తనం అని అంతర్జాతీయ మీడియా మరియు అమెరికా మీడియా అంటోంది.

 

అమెరికా దేశంలో ప్రభుత్వం తరఫున పనిచేసే ఆరోగ్య శాఖ, జాతీయ దర్యాప్తు సంస్థ, నిఘా వర్గాలు ప్రాణాంతక వైరస్‌ గురించి హెచ్చరించినా ట్రంప్‌ పట్టించుకోలేదని అమెరికా మీడియా ఆరోపిస్తోంది. మొదటిలోనే దేశాన్ని షడ్డౌన్ చేసి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదని మీడియా వర్గాలతోపాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా అంటున్నారు. ఇంత డ్యామేజ్ జరిగినా గాని ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్..తప్పు తన దగ్గర లేదని టెంపర్ తనంగా మొన్నటిదాకా మాట్లాడారు. వైరస్ గురించి వచ్చిన సమయంలోనే చైనా ప్రయాణాలపై అందరికంటే ముందే నిషేధం విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.

 

మరి ఇన్ని వేల మరణాలకు కారణం ఎవరని అమెరికా మీడియా ప్రశ్నిస్తుంది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారటంతో అమెరికా ఈ స్థితికి రావటానికి కారణం 'WHO' మరియు చైనా అంటూ డోనాల్డ్ ట్రంప్ మాట మారుస్తున్నారు. పీకలదాకా వస్తే గాని డోనాల్డ్ ట్రంప్ కి జ్ఞానోదయం అయినట్టు లేదని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. దీంతో ఇప్పుడూ మీడియా పై టెంపర్ గా మాట్లాడే డోనాల్డ్ ట్రంప్...ఈ ఏడాదే అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, అవసరం తనది కావడంతో… కొద్ది రోజుల నుండి మీడియా విషయాల్లో చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: