దేశంలో కరోనా విజృభిస్తుందన్న నేపథ్యంలో దానిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు, కంపెనీలు మూతబడ్డాయి. ఈ పరిణామం ప్రజల వ్యక్తిగత ఆదాయంపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో వారికి కొంత రిలీఫ్ ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) తమ ఖాతాదారులకు నగదు ఉపసంహరణ అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ఖాతాదారులందరికీ మొబైల్ ఫోన్ ద్వారా సందేశాలనూ పంపుతోంది. 

 

లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది నిజంగా ఊరట కలిగించే నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలోని అన్ని సంస్థల ఉద్యోగులకు ఈ క్యాష్ విత్‌డ్రా అవకాశం ఉంటుంది. మీ ఖాతాలోని సొమ్ములో 75 శాతం లేదా మీ మూడు నెలల బేసిక్ సాలరీ, డీఏకు సమానమైన మొత్తాన్ని మీరు తీసుకోవచ్చు. వీటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకుని నగదు ఉపసంహరణకు అనుమతిస్తారు. 

 

ఉదాహరణకు మీ పీఎఫ్ ఖాతాలో రూ.50వేల (ఉద్యోగి విరాళం, సంస్థ వాటా, వీటిపై వడ్డీ అంతా కలిపి) సొమ్ము ఉందనుకుందాం. మీ బేసిక్ సాలరీ, డీఏ నెలకు రూ.15వేలుగా ఉంది. అంటే మూడు నెలలకు రూ.45 వేలు అవుతుంది. ఖాతా సొమ్ము రూ. 50 వేలలో 75 శాతం అంటే రూ. 37, 500. దీంతో మీరు పీఎఫ్ అడ్వాన్స్‌గా ఈ రూ. 37,500 లనే ఉపసంహరించుకోవచ్చు.

 

గత 15 రోజుల్లో దాదాపు రూ.950 కోట్ల విలువకు సంబంధించి 3.31 లక్షల క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో పరిష్కరించినట్టు గురువారం కార్మిక మంత్రిత్వశాఖ తెలియజేశారు. ఈపీఎఫ్‌ నిధిలో చందాదారుని వాటా మొత్తం నుంచి 75 శాతం లేదా మూడు నెలల మూలవేతనం, కరువు భత్యం ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్‌ఓ స్కీమ్‌ నోటిఫికేషన్‌ మార్చి 28న విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: