ప్రస్తుతం కరోనా వైరస్ చాపకింద నీరులాగా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డోన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో చాలామంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రోజువారి పనితో జీవనం కొనసాగించే వారికి చాలా పెద్ద చిక్కే వచ్చిపడింది అనే చెప్పాలి. ఇలాంటి వారి కోసం ప్రముఖ అధికారులు, కంపెనీలు నటి, నటిమణులు ఇలా చాలా మంది వారికి సహాయం చేస్తూనే వచ్చారు. 

 

ఇక అసలు విషయానికి వస్తే... సాధారణంగా వాట్సాప్ వలన నష్టాలు ఉన్నాయని కొందరు అంటుంటారు. కానీ వాట్సాప్ లో ఎన్ని నష్టాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ లాభాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వాట్సాప్ కరోనా వైరస్ తో బాధపడే వారికి చాలా అండగా నిలుస్తుంది. ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో సహాయం చేసే మానవత్వం ఉన్న వారిని గ్రూప్ లో యాడ్ చేస్తూ ఉన్నారు. వారి నుంచి డబ్బులను సేకరిస్తూ వాటితో సరిపడా సరుకులు కొనుగోలు చేసి ప్రజలకు సహాయం చేసే కార్యక్రమాలు చేపట్టింది వాట్సాప్. ఈ మొత్తం బాధ్యత గ్రూప్ అడ్మిన్ తీసుకుంటున్నారు. ఇలాగే ఫేస్బుక్ ద్వారా కూడా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు చాలామంది. 

 

 


ప్రస్తుతం లాక్ డోన్ సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్న వారి అందరికీ చాలా సహాయం చేస్తుంది అనే చెప్పాలి. అలాగే రక్తదానం కార్యక్రమాలకు కూడా వాట్సాప్ అండగా నిలబడుతుందని చెప్పాలి. వాట్సాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలకు అండగా నిలుస్తుంది. ఏది ఏమైనా కానీ వాట్సాప్ ద్వారా ప్రజలకు ఏదో విధంగా అండగా నిలవడం చాలా ఆనందకరమైన విషయం అనే చెప్పాలి. ఈ కార్యక్రమంతో ఎందరో మంది అభాగ్యుల కడుపు నింపుతుంది అనే చెప్పాలి. ఈ కార్యక్రమానికి చాలామంది వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: