అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సకుటుంబ సమేతంగా గ‌త నెల‌లో భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇండియా టూర్లో భాగంగా అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు, కుటుంబ సభ్యులు తాజ్‌మహల్‌ను సంద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ట్రంప్‌, ఆయ‌న త‌న‌య ఇవాంక త‌దిత‌రులు అక్క‌డ ఫోటోలు దిగారు. అయితే, ఈ ఫొటోల‌ను కొంద‌రు తుంటరి వాళ్లు త‌మ‌దైన శైలిలో ఫోటోషాప్‌లో ఎడిట్ చేశారు. ఇవాంకా ఒడిలో కూర్చున్న‌ట్లు, ఆమె భుజాల‌పై చేతులు వేసిన‌ట్లు, ఆమెను సైకిల్‌పై ఎక్కించుకొని వెళ్లిన‌ట్లు...ఇలా ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌మ ఫోటోషాప్ స‌త్తా చూపించారు. స‌హ‌జంగానే అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అవి ఇవాంకా దృష్టికి చేరినా ఆమె చాలా స‌ర‌దాగా స్పందించారు.

 

ఇలా ఇండియ‌న్ల‌ను ప్ర‌శంసించిన ఇవాంకా తీరు ఇప్పుడు సొంత దేశ‌మైన అమెరికాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్నది. 24 గంటల వ్యవధిలో అమెరికాలో కరోనా సోకి 4491 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క రోజులో ఇంత మంది కరోనా బారిన పడి మరణించడం  అమెరికాలో ఇదే మొదటి సారి. ఇలాంటి త‌రుణంలో అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇంవాంకా ట్రంప్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. తన భర్త జారెడ్ కుష్న‌ర్‌తో కలిసి వాషింగ్టన్ నుంచి న్యూజెర్సీ వెళ్లారు. ఏదో అత్యవసర పని మీద కాదంట‌. ఓ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు వీరు ఫెడరల్ నిబంధనలను తుంగలో తొక్కి మరీ ప్రయాణించారట‌. దీంతో ఇవాంకా తీరుపై ప‌లువురు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. 

 

కాగా, అమెరికాలో క‌రోనా క‌ల‌వ‌రం కొన‌సాగుతోంది. ఇప్పటి వరకూ ఈ మహమ్మారి కారణంగా 32 వేల 912 మంది మరణించారు. గురువారం రాత్రికి అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ట్ 31,071 మరణాలను నమోదు చేసింది. మార్చి రెండో వారం వరకూ అమెరికాలో కరోనా పెద్దగా ప్రమాద ఘంటికలు మోగించలేదు కానీ ఆ తరువాత వీర విహారం చేసింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశంగా అమెరికా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: