ప్రపంచంలో కరోనా ఏ ముహూర్తంలో మొదలైందో కానీ.. మనిషి మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది.  మనిషిని మనిషి ముట్టుకోవాలంటే బయపడిపోతున్నాడు. సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.  అయితే కరోనా వ్యాప్తి జరగకుండా దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  దారుణమైన విషయం ఏంటేంటే కరోనా ఇప్పుడు కరెన్సీ నోట్లపై కూడా ప్రభావం పడిపోతుంది. కరోనా చేతితో పట్టుకోవడం.. నాలికతో అంటుకున్న వేళ్లతో లెక్కించడం కామన్ గా చేస్తుంటారు. ఇలాంటి చర్యల వల్ల కరోనా విస్తరిస్తుందని అధికారులు అంటున్నారు.  తాజాగా లాక్‌డౌన్ సమయంలో కరోనా హాట్‌స్పాట్ అయిన ఇండోర్ నగరంలోని హీరానగర్ రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి కరెన్సీ నోట్లను వెదజల్లడం సంచలనం రేపింది.  

 

ఇండోర్ నగరంలోని హీరానగర్ ప్రాంతంలోని వీధి రోడ్డుపై ఓ ఆగంతకుడు 6,480 రూపాయల కరెన్సీ నోట్లను వెదజల్లారని హీరానగర్ పోలీసు ఇన్‌స్పెక్టరు రాజీవ్‌సింగ్ భడోరియాకు సమాచారం వచ్చింది.  సాధారణంగా డబ్బు అంటే ఎవరికైనా ప్రీతి.. కానీ ఇక్కడ రోడ్లపై డబ్బు చూసి జనాలు భయంతో వణికిపోయారు. కరెన్సీనోట్లను పట్టుకుంటే కరోనా వైరస్ సోకుతుందనే భయంతో ప్రజలెవరూ ఈ నోట్లను ముట్టుకోలేదు. పోలీసులు వచ్చి ఈ కరెన్సీనోట్లను శానిటైజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఎవరో కావాలని కరెన్సీనోట్లను రోడ్డుపై వెదజల్లారని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఇన్‌స్పెక్టరు రాజీవ్‌సింగ్ చెప్పారు.

 

ఇటీవల తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొందరు ఎలాంటి ప్రయాణాలు చేయకపోయినా, కరనా సోకిన వారితో కాంటాక్ట్ కాకపోయినా కూడా వారికి కరోనా సోకింది. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకడం, వారు కరెన్సీ లావాదేవీలు ఎక్కువగా నిర్వహించినట్టు తేలడంతో, కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కరోనా తో మేబెలెత్తిపోతున్న  నేపథ్యంలో కేవలం డిజిటల్ మనీ మాత్రమే ఉపయోగించుకోవాలని... కరెన్సీ నోట్లను మార్పిడి చేసుకోవద్దు సూచించింది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: