చైనా ఉద్దేశ‌పూర్వ‌కంగానే క‌రోనా విష‌యం దాచింద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో అసోసియేటెడ్ ప్రెస్ ఏపీ కొన్ని సంచ‌లనాత్మ‌క‌మైన క‌థ‌నాల‌ను బ‌య‌ట‌ప‌డింది. జ‌న‌వ‌రిలోనే క‌రోనా బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టికి ఈ విష‌యాన్ని దాచి  ప్ర‌పంచాన్ని ప్ర‌మాదంలో ప‌డేసింద‌ని క‌థ‌నంలో ఆధారాల‌తో స‌హా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. జ‌న‌వరి 6నే చైనాలోని స‌ముద్ర ఆహార ఉత్ప‌త్తుల‌ను భుజించిన వారిలో ఓ వింత వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని స‌మాచారం. వుహాన్ ఆస్ప‌త్రుల్లో కొంత‌మంది ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోగా ఈ వింత వైర‌స్ గురించి స్థానికంగా వెలుగులోకి వ‌చ్చింది.

 

స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ విష‌యాన్ని అక్క‌డి ప్ర‌భుత్వం మాత్రం బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియనివ్వ‌లేదు. అయితే వింత వైర‌స్ విష‌యం డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌తినిధుల‌కు తెలియ‌డంతో చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌తో ఆరా తీశారు. అయితే చైనాలో అలాంటి దేమీ లేద‌ని బుకాయించ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌ల్లో చైనా డొల్ల‌త‌నం అంతా బ‌య‌ట‌ప‌డుతోంది. వాస్త‌వానికి ప‌క్క‌నే ఉన్న థాయ్‌లాండ్ కూడా  వింత వైర‌స్ గురించి దాని ప్ర‌భావం, ల‌క్ష‌ణాల గురించి హెచ్చ‌రించినా చైనా అంత‌గా ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా తెలుస్తోంది.

 

గత ఏడాది డిసెంబరు ఒకటో తారీఖున గుర్తించిన చైనా  జనవరి 14 నాటికి కూడా  అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.  ప్రమాద తీవ్రతను డ‌బ్ల్యూహెచ్‌వో అధికారుల దృష్టికి తీసుకెళడానికి ఇష్ట‌ప‌డ‌లేదు. జనవరి 20 నాటికి చైనాలో బాధితుల సంఖ్య 25 వేలకు పెరిగింది. అప్పుడు గాని చైనా ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌లేదు. జ‌న‌వ‌రి మొద‌టివారంలోనే వ్యాధిని గుర్తించిన చైనా ప్ర‌బ‌ల‌కుండా జాగ్రత్త చ‌ర్య‌లు తీసుకోక‌పోగా ప్ర‌పంచ వ్యాప్తికి కార‌ణ‌మైంద‌ని ఇప్పుడు అర్థ‌మ‌వుతోంది. చైనా ఇలా ఎందుకు చేసి ఉంటుంద‌నే విష‌య‌మై భిన్న వాదన‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌పంచాన్ని ప్ర‌మాదంలో ప‌డేసిన చైనా క‌రోనా విష‌యాన్ని కావాల‌నే దాచిన‌ట్లుగా అమెరికాతో పాటు వివిధ దేశాల ప్ర‌జ‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాజ‌గా బ‌య‌ట‌కు వ‌స్తున్న విష‌యాలు కూడా ఆ అనుమానాల‌కు బ‌లం చేకూర్చేలా ఉన్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: