కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసే విషయంలో లాక్ డౌన్ కన్నా మరొక మార్గం లేదని ప్రధాని నోట వచ్చిన తర్వాత ఇప్పుడు దేశం మొత్తం మరొక రెండు వారాలు కు పైగా సంక్షోభంలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మోడీ తో సంబంధం లేకుండా తెలంగాణతో సహా మరో నాలుగు రాష్ట్రాలు వచ్చే నెల వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే భారత ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా క్షీణించిన పరిస్థితిలో కేంద్రం.... వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తేదీన లాక్ డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలిస్తున్నామంటూ జారీచేసిన మార్గదర్శకాలు గురించి తెలిసిందే.

 

ఇప్పటికే అత్యవసర సేవల కు మొదటి నుండి లాక్ డౌన్ కు మినహాయింపులు ఇవ్వగా ఇప్పుడు దీనికి తోడుగా మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు కొందరిలో హర్షం వ్యక్తం చేశాయి. అయితే నెల 20 నుండి అమల్లోకి రానున్న మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్దగా రుచించలేదు.

 

కావున విశ్వసనీయ వర్గాల దగ్గర నుండి సమాచారం ఏమిటంటే కేంద్రం తాజాగా విడుదల చేసిన లాక్ డౌన్ కు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకూడదు అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ ఈనెల మొదటిలోనే తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గిపోతుంది అని అంచనా వేయగా.... తబ్లిగి జమాత్ సంఘటన తర్వాత అంచనాలకు భిన్నంగా హైదరాబాద్ తో పాటు మరిన్ని జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో పాజిటివ్ కేసులు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు మరియు లాక్ డౌన్ మినహాయింపులను తెలంగాణలో అమలు చేయకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: