దేశంలో కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో ఎక్కడి వ్యవస్థలు అక్కడే ఆగిపోయాయి. దాంతో ఆర్థిక వ్యవస్థ అష్ట కష్టాల్లో పడింది.  ప్రాణాలు ముఖ్యం.. ఇప్పుడు డబ్బు కాదు అన్న పరిస్థితి ఏర్పడింది.  దాంతో కరోనా కట్టడి చేయడానికి తెలుగు రాష్ట్రాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.  ఆర్థిక రాబడి ఎక్కడ నుంచి లేక పోవడంతో ఉద్యోగుల పై భారం పడింది. దాంతో నాలుగో తరగతి ఉద్యోగులకు పది శాతం తప్ప మిగతా ఉద్యోగులందరికీ.. పెన్షనర్లకు సైతం సగం కోత విధించారు. 

 

అయితే, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌లో 50 శాతం కోతపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు.. ఏ ప్రాతిపదికన పెన్షన్‌లో కోత విధించారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌లో కోత విధించడం సమంజసం కాదని అభిప్రాయపడిన హైకోర్టు.. లాక్‌డౌన్ సమయంలో పెన్షనర్లకు అనారోగ్య సమస్యలు వస్తే ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించింది. 

 

వయోభారం పడటంతో వారికి ఏదైనా సమస్యలు తలెత్తితో ఇబ్బంది ఎదురువుతుందని అన్నారు.  పెన్షనర్ల విషయంలో ప్రభుత్వం దయాగుణంతో వ్యవహరించాలని హైకోర్టు పేర్కొంది.. పూర్తి పెన్షన్ ఇచ్చేలా సర్కారును ఒప్పించాలని ఏజీకి సూచించిన హైకోర్టు... తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: