కరోనా విస్ఫోటనం.. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కేసుల సంఖ్య జెట్‌ స్పీడ్‌లో పెరుగుతోంది. మార్చి మొదట్లో ప్రపంచవ్యాప్తంగా లక్ష కేసులుంటే, నెలరోజులు తిరిగేసరికల్లా 20లక్షలు దాటిపోయాయి. ప్రస్తుతం ప్రతిరోజు 70వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన చూస్తే నెలరోజుల్లోనే కోటి మంది బాధితులయ్యే ప్రమాదముందంటున్నారు నిపుణులు.

 

చైనా దేశంలో వుహాన్‌లో కరోనా వైరస్ పుట్టింది. జనవరి 22న.. తొలిసారిగా 580 కేసులు నమోదైనట్లు చైనా తెలిపింది. జనవరి 23వ తేదీకి కేసుల సంఖ్య 845కు పెరిగాయి. కేవలం రెండు రోజుల్లోనే 1317కు చేరాయి. మరో రెండు రోజుల్లో అవి 2,800కు పెరిగాయి అంటే రెండు రోజుల్లో  కేసులు రెట్టింపయ్యాయి. అక్కడి నుంచి వారం రోజులకోసారి రెట్టింపు కేసులు వచ్చాయి. ఫిబ్రవరి 3న 20 వేలున్న కేసులు.. ఫిబ్రవరి 10కల్లా 43 వేలకు చేరాయి. ఆ తర్వాత ప్రపంచమంతటా కేసులు పెరుగటం మొదలైంది. 32 రోజుల వ్యవధిలో ప్రపంచమంతా లక్షా 56వేలు కేసులు దాటాయి. మార్చి 15కు లక్షా 69 వేలు .. అంటే రోజుకు 13వేల కేసులు నమోదయ్యాయి. మార్చి 16 నుంచి 21 అంటే ఐదురోజులకు.. లక్షా 22వేల కేసులు నమోదయ్యాయి. అంటే 3 లక్షల 5 వేల కేసులు నమోదైనట్లు తేలింది. అక్కడి నుంచి పదిరోజులకు అంటే ఏప్రిల్ ఒకటి నాటికి 9 లక్షల 36 వేల కేసులు.. ఏప్రిల్2- 3 మధ్య ఏకంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుతం 70వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

 

జనవరి 22న 17 మందితో ప్రారంభమైన మరణాలు... జనవరి 25వరకూ 56కు చేరాయి. ఫిబ్రవరి పది నాటికి వెయ్యి మరణాలకు చేరుకున్నాయి. ఫిబ్రవరి పది నుంచి నెలరోజుల వ్యవధిలో 4వేల మంది చనిపోయారు. మార్చి 21కి పదమూడు వేల మార్కును దాటాయి. ఏప్రిల్ ఒకటికి అంటే కేవలం పదిరోజుల వ్యవధిలో ఈ సంఖ్య 47వేలకుర చేరుకుంది. ఏప్రిల్ ఒకటి నుంచి పదో తేదీకల్లా మరణాలు రెట్టింపయ్యాయి. దీంతో మొత్తం మరణాలు లక్షా 2వేలకు చేరుకున్నాయి. ఏప్రిల్ పది నుంచి రోజుకు ఆరేడు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ఇప్పటివరకూ లక్షా 44వేల 700 మంది చనిపోయారు.

 

కేసుల విషయానికొస్తే గణాంకాల్ని బట్టి చూస్తే.. ఆదిలో రెండు రోజులకోసారి రెట్టింపైన కేసులు.. తర్వాత వారం రోజులకు డబుల్‌ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికే 21 లక్షల 68వేలు కేసులు దాటాయి. అంటే .. రోజువారీగా చూస్తే 70 వేలుగా కనిపిస్తున్నా.. వారం రోజులకోసారి డబుల్ అవుతూ వస్తోంది. వైరస్ నియంత్రణ సాధ్యం కాకుంటే నెలరోజుల్లోనే దాదాపు కోటి వరకూ కేసులు పెరిగే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇప్పటివరకూ అమెరికా, యూరోప్  దేశాల్లోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.అయితే ఇప్పుడు ఇండియాలోనూ కరోనా వైరస్ స్టేజ్‌-3కి విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. కమ్యూనిటీ  ట్రాన్స్‌మిషన్ విస్తరిస్తే జరిగే విస్పోటనం ఎలా ఉంటుందన్నది ఊహకు కూడా అందని పరిస్థితి. దాదాపు 130 కోట్లకు పైగా జనాబా ఉన్న ఇండియాలో కేసులు పెరిగితే.. ఈసంఖ్య ఇంకా ఎంతవరకూ పోతుందో తెలియడం లేదు. కరోనాకు ఇప్పుడప్పుడే మందు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ మహమ్మరి బారిన ఎంతమంది పడాల్సి వస్తుందో, ఎందరు బలవ్వాల్సి వస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. 

 

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి నుంచి ఎలా బయటపడాలి అని సతమతమవుతుంటే.. పాకిస్థాన్ దొంగదెబ్బ తీయాలనే ప్లాన్ వేస్తోంది. దీనినే అదునుగా పాకిస్తాన్ సైన్యం గత నెల రోజుల కాలంలో 411 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది.  అయితే, కొన్ని రోజుల క్రితం దట్టమైన మంచుతో కప్పబడిన కొండల్లో పాక్ ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడుతున్న సమయంలో ఇండియా ఆర్మీ అలర్ట్ అయ్యి వారితో నేరుగా తలబడింది.  ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చింది. ఇండియాకు సమీపంలోనే ఉన్న పాక్ బోర్డర్లో పెద్ద ఎత్తున లాంచ్ ప్యాడ్, మందు గుండు సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారని పక్కా సమాచారం అందటంతో ఇండియా ఆర్మీ అలర్ట్ అయ్యింది. పాక్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ పై దాడులు చేసింది.  ఇండియన్ ఆర్మీ మెరుపు దాడిలో పాక్ లాంచ్ ప్యాడ్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: