జగన్ సర్కార్ పది నెలల పాలన మీద విశ్లేషణ చేయాలంటే ఏమీ లేదు, ఎంతో ఉంది. ఈ రెండూ చెబుతారేమో. ఎందుకంటే పది నెలల్లో దేశం మొత్తం చూసేలా సంక్షేమ కార్యక్రమాలు జగన్ అద్భుతంగా అమలు చేశారు. చేతికి ఎముక లేనట్లుగా కూడా ఆయన అన్ని హామీలను నెరవేర్చారు.

 

ఇక ఇపుడు చూసుకుంటే మైనస్సులూ అన్నీ ఉన్నాయి. అవెలా అంటే ఆది నుంచి వివాదాస్పద నిర్ణయాలే. ఇసుక కొరత నుంచి, రియల్ బూం పడిపోవడం నుంచి. రాజధానుల ముచ్చట. పోలవరంలో రీ టెండరింగ్ జాప్యం,  ఇపుడు ఇంగ్లీష్ మీడియం వరకూ అన్నీ తొందరపాటు, తడబాటు నిర్ణయాలే.

 

సరే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే రాష్ట్రంలో ఉన్న వేలాది పంచాయతీలకు రంగులు వేశారు. అవి పార్టీకు సంబంధించి మూడు రంగులను అచ్చం గుద్దేశారు. మరి ఇది ఎవరి ఉత్సాహమో తెలియదు కానీ ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా వైసీపీ రంగులతో వైభవం సంతరించుకున్నాయి.

 

దీని మీదనే ఇపుడు రచ్చ రచ్చ అవుతోంది. దీని మీదనే  కోర్టులో ప్రజావాజ్యాలపైన స్పందించిన కోర్టు వాటి రంగులు తొలగించాలని ఆదేశించింది. దీని మీద విచారణ సందర్భంగా ఇపుడు మూడు నెలల సమయం ఏపీ సర్కార్ అడుగుతోంది. అయితే ముందు పంచాయతీ అఫీసులకు రంగులు తొలగించిన మీదంటే స్థానిక ఎన్నికలు పెట్టుకోండని కోర్తు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.

 

అంటే అదే నిజమైతే స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం అవుతాయని వైసీపీ పెద్దలు భయపడుతున్నారుట. ఎవరో చేసిన పొరపాటు, అతి ఉత్సాహం దాన్ని అలాగే కానీయ్ అని వదిలేసిన హై కమాండ్ పుణ్యామని ఇపుడు పార్టీకి ప్రభుత్వనికి రంగు పడినట్లుగా ఉంది. మరి కోర్టు దీని మీదనే తీర్పు ఇస్తే ఇక లోకల్ బాడీ ఎన్నికలు మరింత ఆలస్యం అవుతాయన్నది చెప్పకతప్పదేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: