తాజాగా మహారాష్ట్రలో ఒక అమానుషమైన ఘటన జరిగి దేశమంతటా కలకలం రేపుతోంది. వివరాలు తెలుసుకుంటే... మహారాష్ట్రలోని పాల్గర్ ప్రాంతంలో నివసించే గిరిజనులు తమ గ్రామంలోకి వలస వస్తున్న వారు దొంగతనాలు చేస్తున్నారని గత కొన్ని నెలలుగా అనుమానిస్తున్నారు. అందుకే తమ గ్రామంలోకి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే... వారిని దొంగలు భావించి కిరాతకమైన చర్యలకు పాల్పడుతున్నారు.


ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఎకో వ్యాన్ లో ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ తో కలిసి పాల్గర్ గ్రామంలోకి ప్రవేశించగా... అది గమనించిన 200 మంది గిరిజనులు వారిపై దాడికి ఒడిగట్టారు. మొదటిగా కారును ఆపిన గిరిజనులు వెనకాల కూర్చున్న ఇద్దరు యువకులను కర్రలతో అతి కిరాతకంగా కొట్టి చంపారు. భయబ్రాంతులకు గురి అయిన డ్రైవర్ పోలీసులకి ఫోన్ చేస్తుంటే అతడిని కూడా పట్టుకొని చచ్చేంత వరకు కొట్టారు. ముగ్గురు యువకులు చనిపోయారు అని తెలిసి కూడా వారి మృతదేహాలను ఎవరూ గుర్తుపట్టకుండా రాళ్లతో నుజ్జునుజ్జు చేశారు.


విషయం తెలుసుకున్న కస పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకోగా వారిని కూడా దొంగలు గా భావించిన గిరిజనులు వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఎట్టకేలకు అతికష్టం మీద గిరిజనులను శాంతపరచి మృతదేహాలను పోస్టుమార్టం కి తరలించి... 30 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాడిలో పాల్గొన్న ఇతరుల కోసం గాలిస్తున్న పోలీసులు... ఇప్పటివరకు దొరికిన వారిపై ఐపిసి సెక్షన్ 302(మర్డర్), సెక్షన్ 188 (అవిధేయత), విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల చట్టం కింద కేసులు నమోదు చేశారు.


చనిపోయిన వారు ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ముగ్గురు అమాయకులు అన్యాయంగా గిరిజనుల చేతిలో చంపబడటం ప్రస్తుతం అందరినీ కలచివేస్తోంది. చాలా ప్రాంతాలలో కరోనా టెస్ట్లు చేసేందుకు వస్తున్న వైద్యులపై కూడా కొంతమంది నిరక్షరాస్యతులు కత్తులు కర్రలతో దాడులు చేసే ఘోరంగా గాయపరుచుతున్నారు. లాక్ డౌన్ ప్రారంభమైన దగ్గర నుండి ఇటువంటి ఘటనలు ఎన్నో జరగడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: