పవన్ కళ్యాణ్ ఇపుడు డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆయన ఓ వైపు సినీ నాయకుడిగా, మరో వైపు రాజకీయ నాయకుడిగా రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఆయన రెండు పడవల్లో కాలు పెట్టినా పక్కా ప్లాన్ తోనే ముందుకు సాగుతున్నారు. ఆయన చూపు అంత 2024 ఎన్నికల మీదనే ఉంది. 

 

ఓవైపు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కాంబో దుమ్ము దులుపుతుందని అనుకుంటున్నాడు. ఈ లోగా ఖాళీ సమయం ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్లుగా ఆయన సినిమాలు వరసగా చేస్తున్నాడు. పవన్ ఇపుడు వకీల్ సాబ్ మూవీ చేస్తున్నాడు.

 

ఈ మూవీని సమ్మర్ కి రిలీజ్ చేయాలి. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇక వచ్చే ఏడాది, ఆ వచ్చే ఏడాది కూడా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోవాలనుకుంటున్నాడు. మొత్తంగా కనీసం 200 కోట్ల రూపాయలనేనా సినిమాల ద్వారా గడించాలని పవన్ ఆలోచన.

 

ఆ విధంగా 2023 నాటికి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి పార్టీని దూకుడుగా పట్టాలెక్కించాలని పవన్ ఆలోచిస్తున్నాడు. దాని వల్ల పార్టీకి ఆర్ధికంగా ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలని పక్కా యాక్షన్ ప్లాన్ తో దిగిన పవన్  ఉత్సాహానికి ఇపుడు కరోనా అడ్డుకట్ట వేసింది. ఇపుడు వకీల్ సాబే ఆగింది. అదెపుడు అవుతుందో ధియేటర్లకు వస్తుందో తెలియదు

 

మరో వైపు మిగిలిన సినిమాలు ఎలా సెట్స్ కి వెళ్తాయో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇదే కాదు, కరోనా నేపధ్యం, లాక్ డౌన్ వల్ల సినీ ఇండస్ట్రీ దారుణంగా దెబ్బ తింటోంది. అందువల్ల సినిమా నటుల పారితోషికాలు చాలా వరకూ తగ్గుతాయి. ఆ విధంగా ఎక్కువ సినిమాలు చేయలేకపోవడమే కాదు, రెమ్యునరేషన్ లో కూడా కోత పడడం అంటే పవన్ కి నిజంగా షాకే.

 

 

మరి ఈ అరకొర ప్రయత్నాలతో ఆయన‌ 2024 నాటికి ఎలా సిధ్ధపడతాడో చూడాలి. మొత్తానికి అందరి ఆశలను చిదిమేసిన కరోనా పవన్ ప్లాన్స్ మొత్తానికి గల్లంతు చేసి బిగ్ షాక్ ఇచ్చేసిందని  అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: