కరోనా వ్యాధి మరీ అంత ప్రాణాంతకమేమీ కాదు. ఇది ఎక్కువగా వృద్ధులకే ప్రాణాంతకం. ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కరోనా ఎక్కువ ప్రమాద కరం. అలాగని మిగిలిన వయస్సుల వారికి కరోనా రాదని కాదు. కానీ వచ్చినా కోలుకునే అవకాశాలు ఎక్కువ. అలాగే ఈ వ్యాధి గురించి మరో అపోహ ఉంది.

 

 

ఇది ఒక్కసారి వస్తే.. ఇక ఆ వ్యాధి నుంచి బయటపడినట్టేనని.. మరోసారి కరోనా రాదని ఓ అపోహ ఉంది. ఇది నిజంగానే అపోహ. కరోనా ఒక్కసారి వచ్చిపోతే.. మళ్లీ రాదని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇప్పటికే చైనాలో కోలుకున్న వారికి ఈ వ్యాధి మళ్లీ తిరగబెడుతుందన్న వార్తలు వస్తున్నాయి. కాబట్టి.. కరోనా నుంచి బయటపడి కోలుకున్న వారు కూడా ఇళ్లకు వెళ్లాక మళ్లీ వ్యాధి రాదన్న ధీమాతో ఉండకూడదు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

 

 

ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నొక్కి వక్కాణిస్తోంది. ఇలాంటి పుకార్లు, అవాస్తవాలు, అపోహల విషయంలో జాగ్రత్తగా ఉండాలి హెచ్చరిస్తోంది. కొందరు తెలియక ఇలా సమాచారం వ్యాప్తి చేస్తుంటే.. మరికొందరికి ఇది ఓ శాడిస్టిక్ అలవాటుగా మారింది. ఇక కరోనా వంటి కష్టకాలంలో ఇలాంటి పుకార్లు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

 

 

అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO ఇలాంటి పుకార్లపై సమాచారం ఇస్తోంది. ఏది సత్యం- ఏది అసత్యం అనే విషయంపై క్లారిటీ ఇస్తూ సమాచారం పొందుపరిచింది. అందుకే గుడ్డిగా సోషల్ మీడియాలో వచ్చే ప్రతివార్తనూ నమ్మేకండి. ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్యసంస్థ వంటివి అందించే నమ్మకమైన సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఆరోగ్యంగా ఉండండి. పుకార్లను అడ్డుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: