ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో పాజిటివ్ గా సంఖ్య రోజు రోజుకి చాప కింద నీరులాగా పెరిగిపోతూ వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రతిపక్ష పార్టీలు పుకార్లు రేపారు. ఈ విషయంపై శ్రీనివాస్ రెడ్డి వారిపై మండిపడడం జరిగింది. తాజాగా నేడు ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కరోనా నియంత్రణ చర్యలను దగ్గర ఉండి పర్యవేక్షణ చేయడం జరిగింది. అలాగే బాపూజీ మార్కెట్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ టర్నల్ ప్రారంభించడం జరిగింది. 

 


ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తెలుగుదేశం, జనసేన పార్టీలు పుకార్ల ప్రచారం చేశాయని వాళ్ళ పై మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి ఆరోపణలు మానుకోవడం మంచిది అని ఆయన తెలియజేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఎవరైనా ఇలాంటి ప్రచారాలు చేశారంటే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు. 

 


అంతేకాకుండా ఎల్లప్పుడు టీడీపీ పార్టీ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూనే ఉంటుంది తప్ప.. సేవా కార్యక్రమాలు నిర్వహించరు అని బాలినేని విమర్శించడం జరిగింది. ఈ లాక్ డౌన్ సమయంలో టీడీపీ పార్టీ నేతలు చేసిన సేవా కార్యక్రమాలు ఏమైనా ఉంటే తెలపండి అని ప్రశ్నించడం జరిగింది. ఇక మరోవైపు లాక్ డౌన్ సమయంలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే స్వయంగా ఫోన్ చేస్తే వారి సమస్య తీర్చడానికి నేను సిద్ధం అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలియజేయడం జరిగింది. సేవా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో నిరాహార దీక్షలు చేయటం మాత్రం రాజకీయ లబ్ది పొందడం కోసమే అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎవరైనా ఇలాంటి పుకార్లు పుట్టించిన వారికి జైలు శిక్షకు అర్హులు అని గుర్తుకు పెట్టుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: