అసలే పడుతూ లేస్తూ వస్తున్న మీడియా రంగానికి ఇప్పుడు కరోనా వైరస్ శాపంగా మారింది. నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడం, సిబ్బంది జీతభత్యాలు, తగ్గుతున్న పాఠక ఆదరణ, ఎలక్ట్రానిక్, వెబ్, సోషల్ మీడియా కు ఆదరణ పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రింట్ మీడియా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో పత్రికలను మూసి వేయలేక ... నడిపించ లేక పత్రికా యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే పత్రికా రంగంలో  అగ్రగామిగా ఉన్న ఈనాడు కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అసలు ఎప్పటి నుంచో పొదుపు చర్యలు తీసుకుంటూ, మొత్తం అన్ని జిల్లాల్లో ఉన్న యూనిట్ ఆఫీస్ లను రామోజీ ఫిలిం సిటీకి తరలించాలనే ఉద్దేశంలో ఉంది. అనుకోకుండా ఆ పనిని మరింత తేలిక చేసినట్టుగా కనిపించింది కరోనా. కొద్ది రోజుల క్రితం కడప జిల్లాలో ఉన్న ఈనాడు యూనిట్ ఆఫీస్ ను మూసివేశారు. ఈనాడు ప్రింటింగ్ యూనిట్ ఉన్న చుట్టుపక్కల రెండు మూడు ఊర్ల లో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి యూనిట్ ఆఫీసును మూసివేశారు. 

 


ఇప్పుడా వంతు మహబూబ్ నగర్ జిల్లా ఈనాడు యూనిట్ ఆఫీస్ కూడా తగిలేలా కనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లా ఈనాడు యూనిట్ మేనేజర్ కుమారుడు కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి వచ్చాడట. అయితే ఆ విషయం బయటకి పొక్కకుండా, ఆ కుటుంబం జాగ్రత్త పడిందట. కానీ ఢిల్లీ రైలు ప్రయాణం చేసిన వాళ్ళందరి వివరాలు వెలికి తీయడంతో పోలీసులు అతనిని క్వారంటైన్ కి తరలించారు. అతను వచ్చి చాలా కాలం అవ్వడంతో కుటుంబ సభ్యులకు కూడా సోకిందనే అనుమానాలు కలిగాయి. కానీ ఎవరికీ పాజిటివ్ లక్షణాలు బయట పడలేదు. అయితే ఇప్పటి వరకు సదరు మేనేజర్ ఆఫీసులోనే పని చేయడంతో, ఆ ఆఫీసు సిబ్బంది నమూనాలు తీసి పరీక్షలకు పంపించారట.

 

IHG
 

అయితే వారికి పాజిటివ్ వచ్చిందా లేక నెగటివ్ వచ్చిందా అనే వివరాలు ఇంకా తెలియలేదు. కానీ ఇప్పుడు ఆ సిబ్బంది, కుటుంబాల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ విషయం కాస్త సదరు యాజమాన్యానికి తెలియడంతో అన్ని జిల్లా యూనిట్ మేనేజర్లకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారట. అసలు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఈ నిర్లక్ష్యం ఏంటి అంటూ ఈనాడు యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలు, లోపాలు, పరిష్కారాలు ఇలా అన్నిటిని ముద్రించే ఆ పత్రిక తమ సొంత సిబ్బంది ఈ విధంగా అజాగ్రత్తగా ఉండడం, ఢిల్లీ లో వచ్చిన తమ కుమారుడు వివరాలు బాధ్యత కలిగిన ఆ మేనేజర్ దాచిపెట్టడం, తద్వారా వైరస్ వ్యాప్తికి పరోక్ష కారణం అయ్యేలా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. అయితే ఇప్పుడు ఈనాడు యూనిట్ ఆఫీసులో టెస్టులకు పంపించిన వారికి రిజల్ట్ ఏమొచ్చింది అనేది తెలియాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: