కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా పెళ్లిళ్లు , శుభ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి . పెళ్లిళ్లు , శుభ కార్యక్రమాలు నిర్వహిస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలుండడం తో , పెళ్లిళ్లు , శుభ కార్యక్రమాల నిర్వహణ పై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి . ఈ విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పలువురు సినీ ప్రముఖులు  కూడా తమ పెళ్ళిళ్ళను కూడా వాయిదా వేసుకున్నారు . ప్రముఖ టాలీవుడ్ హీరో నితిన్  పెళ్లి ,  కరోనా కారణంగానే  నిలిచిపోయింది . 

 

పెళ్లిళ్లు, శుభ కార్యక్రమాలు నిలిచిపోవడంతో , ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది . ఏప్రిల్ , మే మాసాల్లోనే అధికంగా పెళ్లిళ్లు , ఇతర శుభ కార్యక్రమాలు ఉంటాయని ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు చెప్పారు .  ముందస్తుగానే ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకోవడం ఆనవాయితీ గా వస్తుందని  పేర్కొంటున్నారు . ఏప్రిల్ , మే మాసా ల్లో జరిగే శుభ కార్యక్రమాలకు  ఫంక్షన్ హాళ్లు ముందస్తుగానే బుక్ అయినట్లు , అయితే కరోనా వైరస్ కట్టడి కోసం  లాక్ డౌన్ ప్రకటించడంతో ఒకొక్కరు తమ పెళ్ళిళ్ళను రద్దు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు .

 

ఇప్పటికే ఒక్క హైదరాబాద్ నగరం లోనే దాదాపు 15 వేల పెళ్లిళ్లు రద్దు అయినట్లు ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు తెలిపారు . గత ఏడాది ఇదే సమయానికి దాదాపు 12 వేల 500 పెళ్లిళ్లు జరిగాయని పేర్కొంటున్నారు . ఈ ఏడాది కరోనా కారణంగా పెళ్లిళ్లు రద్దు కావడంతో , పురోహితులు అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు . ఒక్క పురోహితులు కాదని ఫ్లోరిస్ట్ లకు కూడా ఉపాధి లేకుండా పోయిందని అంటున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: