ఒక నెల ముందు వరకు ఉరుకులు పరుగులు కలిగిన ప్రపంచాన్ని కరోనా వైరస్ వచ్చి ఒక కుగ్రామం లా మార్చేసింది. ప్రమాదకరమైన ఈ మహమ్మారి వైరస్ కి మందు లేకపోవటంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇటువంటి సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేవరకు నియంత్రణ ఒకటే మార్గమని ప్రతి దేశానికి హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తుంది. దీంతో చాలావరకు దేశాలు లాక్ డౌన్ కి పిలుపునివ్వడం జరిగింది. చాలా వరకు ప్రపంచ ప్రజలంతా ఇళ్లకు పరిమితమయ్యారు. మరోపక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమ క్రమంగా ఎలా పెరుగుతున్నాయో మరణాలు కూడా అలాగే సంభవిస్తున్నాయి.

 

ఈ వైరస్ నీ అంతమొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మన దేశ శాస్త్రవేత్తలు కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారు. ఇటువంటి తరుణంలో హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ పరిశోధకులు క్రియ రహిత వైరస్ టీకా అభివృద్ధిపై ద్రుష్టి పెట్టారు. రెండు నెల్లలో దీనికి ఓ రూపు తేవడానికి ప్రయత్నిస్తున్నామని.. సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.

 

ఈ టికాకి పరిశోధనలు వేగవంతం చేశామని ఆయన తెలిపారు. చేస్తున్న ప్రయోగాలు అంతా సక్సెస్ అయితే రెండు నెలలలోనే ఓపిక పడితే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్నట్లుగా రాకేశ్ మిశ్రా చెప్పుకొచ్చారు. ఆల్రెడీ పోలియో మరియు రేబిస్ టీకాలు ఈ విధంగానే ల్యాబ్ లో తయారు చేసినట్లు... వైరస్ ని పెంచి పోషించిన తర్వాత దానిపై తయారు చేసిన వ్యాక్సిన్ ని ప్రయోగిస్తామని చెప్పుకొచ్చారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple.




మరింత సమాచారం తెలుసుకోండి: