ప్రపంచాన్ని కంటిమీద కునుకు లేకుండా భయ కంపితులను చేస్తుంది కరోనా వైరస్. కరోనా వైరస్‌ విజృంభించడంతో.. ప్రజలు గజగజ వణుకుతున్నారు. భారత్‌ నలుమూలల కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరించింది. రోనా వైరస్‌ కేసులు రోజురోజుకు అధికంగా నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 32 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 24 గంటల్లో 1076 కొత్త కేసులు నమోదు అయినట్లు పేర్కొంది.  నోవెల్ క‌రోనా వైర‌స్‌కు టీకా అభివృద్ధి చేయ‌డంపైనే తాము దృష్టి పెట్టిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు.

 

ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్19 వ్యాక్సిన్‌ను వీలైనంత వేగంగా అభివృద్ధి చేస్తామ‌న్నారు. సుమారు 19 రాష్ట్రాల్లో వైర‌స్ రెట్టింపు స‌గ‌టును జాతీయ స్థాయి క‌న్నా త‌క్కువ‌గా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. బీసీజీ, క‌న్వ‌ల్‌సెంట్ ప్లాస్మా థెర‌పి, మోనోక్లోన‌ల్ యాంటీబాడీస్‌తో వైర‌స్‌ను జ‌యించే వ్యాక్సిన్‌ను త‌యారు చేసేందుకు ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు. ఏప్రిల్ ఒక‌ట‌వ తేదీ నుంచి వైర‌స్ వృద్ధి రేటు స‌గ‌టున 1.2గా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

 

అయితే మార్చి 13 నుంచి 15 వ‌ర‌కు మాత్రం జాతీయ స‌గ‌టు 2.1గా ఉన్న‌ద‌న్నారు. మొత్తంమీద జాతీయ స్థాయిలో వైర‌స్ వృద్ధి రేటు 40 శాతం ప‌డిపోయిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ‘కరోనా’ కేసులు 13,387 నమోదయ్యాయని, 1,749 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడ్డవారిలో 80 శాతం మంది కోలుకుంటున్నారని వివరించారు. ‘కరోనా’ నివారణకు మరిన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.  ఈ కారణంతోనే లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించారని..అప్పటి వరకు అదుపులోకి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: