కరోనా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా.. సింపుల్ చిట్కా.. గట్టిగా ఊపిరి పీల్చి గుండెల నిండా గాలి నింపుకుని ఓ పది సెకన్లు బిగపట్టి ఉండండి.. మీకు ఎలాంటి ఇబ్బంది అనిపించకపోతే.. ఎక్కడా నొప్పి కానీ.. అసాకర్యం కానీ అనిపించకపోతే.. మీకు కరోనా లేనట్టే.. సరిగ్గా ఇలాంటి మేస్సెజ్ లు మీరు చదివారా.. ఇలాంటివి నమ్మకండి.. ఇలాంటి చిట్కాలతో కరోనాను గుర్తు పట్టే అవకాశమే లేదు.

 

 

ఎందుకంటే.. కరోనా మనిషికి సోకగానే అది తన ప్రతాపం చూపించదు. అది తన లక్షణాలు బయటపెట్టాలంటే ఇంక్యుబేషన్ పిరియడ్ అని ఉంటుంది. ఆ తర్వాతే కరోనా లక్షణాలు బయపడతాయి. అప్పటి వరకూ మనిషి దుక్కలా కనిపిస్తాడు. ఎలాంటి జబ్బు ఉన్నట్టు అనిపించదు. ఎలాంటి అసౌకర్యమూ ఉండదు.

 

 

అందువల్ల ఇలాంటి చిట్కా వైద్యాలతో ట్రిక్కులతో మీరు కరోనా ఉందో లేదో తెలుసుకోలేరు. అందుకే ఇలాంటి పోస్టులు మీరు నమ్మకండి.. సోషల్ మీడియా వచ్చేశాక ఇప్పుడు ఏ వార్త అయినా సరే క్షణాల మీద ప్రపంచమంతా వ్యాపిస్తోంది. ఫేస్ బుక్, వాట్సప్.. ఇన్‌స్టాగ్రామ్.. ఇలా అనేక వేదికలపై సమాచారం రాకెట్ వేగంతో స్ప్రెడ్ అవుతోంది. అయితే మొదట వచ్చిన సమాచారం తప్పయినా సరే.. ఆ విషయం గమనించేలోగానే అది కోట్ల మందికి చేరిపోతోంది. అలా అనేక తప్పుడు విషయాలు జనంలోకి వెళ్తున్నాయి.

 

 

కొందరు తెలియక ఇలా సమాచారం వ్యాప్తి చేస్తుంటే.. మరికొందరికి ఇది ఓ శాడిస్టిక్ అలవాటుగా మారింది. ఇక కరోనా వంటి కష్టకాలంలో ఇలాంటి పుకార్లు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO ఇలాంటి పుకార్లపై సమాచారం ఇస్తోంది. వాటినే నమ్మండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: