నేటికీ అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలైన చైనా, భారత్ లతో సహా బ్రెజిల్, మెక్సికో నైజీరియా లాంటి దేశాలు వచ్చే 30 సంవత్సరాలలో... అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ, జపాన్ దేశాలను అధికమించి ఆర్థిక రంగాన్ని ఏలుతాయని తాజాగా ఒక సర్వేలో తేలింది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వలన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైవుతున్నప్పటికీ.. 2050 సంవత్సరం నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పెరిగిపోతుంది ప్రముఖుల అంచనాలు బలంగా ప్రతిబింబిస్తున్నాయి.


ఐక్యరాజ్యసమితి ప్రకారం... 2050 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా సంఖ్య 26 శాతం పెరిగినప్పటికీ... ప్రపంచ మార్కెట్ మాత్రం రెట్టింపు స్థాయిలో అభివృద్ధి చెందుతుందట. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలే ఇంకో 30 సంవత్సరాలలో ప్రపంచ మార్కెట్లో శక్తివంతంగా మారనున్నాయి. ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) ఇంటర్నేషనల్ సంస్థ యొక్క 'ది వరల్డ్ ఇన్ 2050' నివేదిక... ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న లిఫ్ట్ లోని 7 దేశాలలో 6 దేశాలు ఇంకో 30 సంవత్సరాలలో బాగా అభివృద్ధి చెందిన దేశాల లిస్టులోకి చేరుతాయని పేర్కొంది.


అంచనాల ప్రకారం రెండవ స్థానంలో ఉన్న అమెరికా 3వ స్థానానికి దిగ జారగా నాలుగవ స్థానంలో ఉన్న జపాన్ ఎనిమదవ స్థానానికి... ఐదవ స్థానంలో ఉన్న జర్మనీ 9 వ స్థానానికి పడిపోతాయని తెలుస్తుంది. వియత్నాం, ఫిలిప్పీన్స్, నైజీరియా లాంటి దేశాల ఆర్ధిక వ్యవస్థలు కూడా రానున్న 30 ఏళ్లలో శరవేగంగా అభివృద్ధి చెందుతాయని తెలుస్తుంది.


ఒక్కసారి 2050 నాటికి అభివృద్ధి చెందనున్న 10 దేశాల జాబితా లిస్టు చూసుకుంటే... 1.చైనా
2. భారతదేశం 3. యుఎస్ 4. ఇండోనేషియా 5. బ్రెజిల్ 6. రష్యా 7. మెక్సికో 8. జపాన్ 9. జర్మనీ
10. యుకె స్థానాలలో ఉండనున్నాయి.


గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో పెరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే... 2050 నాటికి ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలకి కచ్చితంగా గట్టి పోటీ ఇస్తుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అని సర్వే చేసిన అధికారులు తెలిపారు. భారతీయులు నివసించే భవనాలు, నడిపే కారులు, యూజ్ చేసే లాప్టాప్స్ కంప్యూటర్లు సెల్ ఫోన్స్ అన్నీ మారిపోయారు ఓ ప్రముఖ ట్రావలింగ్ నిపుణుడు తెలిపాడు. మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ రెండవ స్థానంలో స్థానంలో నిలుస్తుందో లేదో చూడాలిక.





మరింత సమాచారం తెలుసుకోండి: