కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అయితే తాజాగా ప్రపంచ దేశాల్లోని మొత్తం భారతీయుల్లో 3,336 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, మరో 25 మంది మృతిచెందినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు సహనం ఉండాలని, స్వదేశానికి తరలించడం అతిపెద్ద విధాన నిర్ణయంలో భాగమని, అందుకే ప్రభుత్వం ఎవరిని తరలించే పరిస్థితి లేదని తెలిపాయి.

 

దేశంలో లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ ఇచ్చి ఆఫీస్ పనులు చేపిస్తున్నారు. మరో వైపు సినిమా షూటింగ్స్ కి సెలవులు ప్రటించారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో లాక్ డౌన్ గడువు సమయాన్ని మరి కాస్త పెంచారు. ఒక్కవైపు దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది. చాల మంది జాబ్స్ కోసం కొన్న ఏళ్ల నుండి కష్టపడిన ఎలాంటి ఫలితం దొరకటం లేదు. అయితే తాజాగా ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

 

సదరన్ రైల్వే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. చెన్నై, పెరంబదూర్‌లోని రైల్వే హాస్పిటల్‌లో పారామెడికల్ సిబ్బందిని నియమించనుంది. ఈ ఆస్పత్రిని కోవిడ్ 19 పేషెంట్ల కోసం కేటాయించారు. అందుకే 197 ఖాళీలను భర్తీ చేస్తోంది సదరన్ రైల్వే. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 

 

ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 22 లోగా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులను టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇవి మూడు నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

 

నర్సింగ్ సూపరింటెండెంట్- 110, హాస్పిటల్ అటెండెంట్- 68, హేమో డయాలసిస్ టెక్నీషియన్- 4,ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2- 4రేడియోగ్రాఫర్- 4, డైటీషియన్- 2, ఫిజియోథెరపిస్ట్- 2, స్కిల్డ్ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్- 2,ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఏప్రిల్ 15 దరఖాస్తుకు చివరే తేదీ- 2020 ఏప్రిల్ 22 విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: