ఇండియాలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. మొదట ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ విధించడంతో 21 రోజుల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని అంతా అనుకున్నారు అయితే అదుపులో ఉండడం అటు ఉంచితే ప్రస్తుతం చేయిదాటిపోయేలా వుంది. ప్రతి రోజు దాదాపు1000కి చెరువులో ఉంటుంది కరోనా బాధితుల సంఖ్య. ముఖ్యంగా మహారాష్ట్ర , గుజరాత్ , రాజస్థాన్ లు తలనొప్పిగా మారాయి. గత వారం రోజుల నుండి  ఈ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇంతకుముందు ఢిల్లీ , తమిళనాడులో ఇదే తరహా  పరిస్థితి వుంది కానీ గత మూడు రోజుల నుండి అక్కడ కేసులు స్వల్పంగా తగ్గాయి. 
 
ఇక సౌత్ విషయానికి వస్తే దేశంలోనే మొదటి కరోనా కేసు నమోదైన కేరళ లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. కరోనా కేసుల సంఖ్య రోజుకు సింగిల్ డిజిట్ దాటడం లేదు. నిన్న ఒక్క కేసు మాత్రమే నమోదు కాగా ఈ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 138. కానీ తెలుగు రాష్ట్రాల్లో అలా కాదు ఓ రోజు తగ్గాయి అని సంతోషించే లోపే మరోసటి రోజు భారీగా పెరుగుతున్నాయి. నిజాముద్దీన్ మత ప్రార్ధనలు ఈరెండు రాష్ట్రాల పై  తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దాంతో కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది.
 
ఈరోజు తెలంగాణలో ఏకంగా 66 కొత్త కేసులు నమోదు అయ్యాయి దాంతో మొత్తం కేసుల సంఖ్య 766కు చేరింది. అలాగే ఆంధ్రా లో ఈ రోజు 38 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 572కు చేరింది.  మరి ఈ రెండు రాష్ట్రాలు కేరళ లా ఎప్పడు మారుతాయో... 

మరింత సమాచారం తెలుసుకోండి: