కరోనా విషయంలో మొదటి నుండీ చాలా అనుమానితంగా ప్రవర్తిస్తున్న చైనా దాదాపు రెండు నెలలు మహమ్మారి వైరస్ బారిన పడినా కేవలం మూడు వేళ మరణాలను అధికారికంగా చూపించడం పెద్ద ఆశ్చర్యం. అటు అమెరికా, ఫ్రాన్స్, ఇరాన్ దేశాలలో రోజుకు కనీసం వెయ్యి మంది విగతజీవులుగా మారుతుంటే…. చైనా లో కేవలం ఇన్నే మరణాలు సంభవించడం.. పరిస్థితి అదుపు లోకి వచ్చాకు ఒక్క సారిగా కేసుల సంఖ్య సున్నా గా మారిపోవడం ప్రపంచ దేశాలను విస్తుపరిచింది.

 

కొన్ని వారాలుగా సుమారు చైనాలో 3,300గా ఉన్న మరణాల సంఖ్య ఇప్పుడు ఒక్కసారిగా 4,600కి చేరుకుంది. అందుకు కారణం వైరస్‌కి కేంద్ర బిందువైన వుహాన్‌లో మరణాల సంఖ్య ఏకంగా 50 శాతం పెరగడమే. అక్కడ మొత్తంగా 1290 మంది కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని తాజాగా వెల్లడైంది.

 

కానీ మరలా చైనా వారు అధికారికంగా 3,800 మరణాలనే లెక్కలోకి చూపించడం ప్రపంచ దేశాల సహనాన్ని పరీక్షించినట్లు అవుతోంది. అసలు వారి వారి దేశస్థుల మరణాల సంఖ్యను ఎందుకు దాస్తున్నట్లు అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా ఇదే విషయమై విమర్శించారు.

 

అయితే గణాంకాలు విడుదల చేస్తున్న సమయంలో వుహాన్ నగర అధికారులు తాము వాస్తవాలను దాచి పెట్టే ప్రయత్నాలు చెయ్యడం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇకపోతే కోవిడ్-19 సంక్షోభం విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై అనుమానం వ్యక్తం చేశారు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్. అక్కడ ఏం జరిగిందో తమకు తెలియదని వ్యాఖ్యానించారు.

 

ఫైనాన్సియల్ టైమ్స్‌ మీడియా సంస్థ తో మాట్లాడిన ఆయన సంక్షోభం విషయంలో చైనా మరింత బాగా వ్యవహరించి ఉండాలని సూచించడం అమాయకత్వమే అవుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: