ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప‌ట్టి పీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు 22 ల‌క్ష‌లు దాట‌గా.. మ‌ర‌ణాల సంఖ్య 1 ల‌క్ష 50 వేలు దాటింది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ప్ర‌పంచ‌దేశాల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇక ఈ క‌రోనా ర‌క్క‌సిని మ‌ట్టుపెట్టాలంటే భౌతిక దూరం, వ్య‌క్తిగ‌త శుభ్ర‌త ముందున్న మార్గాలుగా క‌నిపించ‌డంతో.. ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించి.. ప్ర‌జ‌ల‌ను బ‌ట‌య‌కు రాకుండా క‌ఠ‌ణ చ‌ర్య‌లు చేపట్టింది. అయితే ప్ర‌స్తుతం 6కోట్ల జనాభా ఉన్న ఇటలీ క‌రోనా దెబ్బ‌కు చిగురుటాకులు వ‌ణికిపోతున్న సంగ‌తి తెలిసిందే.

 

ఇటలీలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 22,170కి చేరుకుంది. 1,68,941 పాజిటివ్ కేసులు అక్కడ నమోదు అయ్యాయి.  వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కంటే ఇటలీలోనే ఎక్కువగా కరోనా మరణాలు నమోదు కావ‌డం గ‌మ‌నార్హం.  ఈ యూరోపియన్ దేశంలో ప్రాణ నష్టం ఊహకు అందని రీతిలో అంతకు అంతకూ పెరుగుతోంది. ఇక వాస్తవానికి ఇటలీలో వ్యాధి నిరోధక శక్తీ కూడా ఎక్కువ.. అంతేకాదు.. ఇటలీలో దేశంలోని వృద్ధుల జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది.. వైరస్‌ కూడా ఎక్కువ శాతం వృద్ధులకే సోకుతోంది పైగా చనిపోయే వారిలో కూడా 80 శాతం వృద్ధులే ఉన్నారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇట‌లీ ఓ శుభ‌వార్త అందుకుంది. 

 

క‌రోనాతో రోజురోజుకు స‌త‌మ‌త‌మ‌వుత‌న్న ఇట‌లీ.. దక్షిణ ప్రాంతాలలో కరోనా వైర‌స్‌పై విజ‌యాన్ని సాధించాయి. ధనిక ఉత్తరం కంటే పేద దక్షిణ ప్రాంతాలలో కరోనా వైర‌స్‌పై ఇటాలియన్ ఆరోగ్య అధికారులు శుక్రవారం సుదీర్ఘకాలంగా విజయం సాధించారు. ప్ర‌స్తుతం ఇక్క‌డ క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది. దక్షిణ ప్రాంత్రాల్లో క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా తీసుకున్న క‌ఠ‌న చ‌ర్య‌లు మ‌రియు లాక్‌డౌన్ వ‌ల్లే ఇది సాధ్యం అయింద‌ని ప్రజారోగ్య మండలి చీఫ్ ఫ్రాంకో లోకటెల్లి విలేకరులతో అన్నారు. కాగా, ఫిబ్రవరి 21 న ఇటలీ యొక్క మొట్టమొదటి కోవిడ్ -19 మరణం నమోదు అయినప్పటి నుంచీ.. అక్క‌డ వేల సంఖ్య మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అలాగే  125 మంది వైద్యులను కూడా క‌రోనా బ‌లి తీసుకుంది. అయిన‌ప్ప‌టికీ వీరు పోరాడుతూనే ఉన్నారు. ఇక ఇన్నాళ్ల‌కు ఇట‌లీ క‌రోనా విష‌యం దక్షిణ ప్రాంతాలలో విజయాన్ని సాధించింది.

  

 

 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: