కేర‌ళ‌కు చెందిన జూలీ మ‌హిళ న్యూజెర్సీలో డాక్ట‌ర్గా ప‌నిచేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా క‌రోనాతో బాధ‌ప‌డుతూ తీసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్గా మార‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల‌ను తాకేలా ఉంది. మార్చి నెల‌లో ఆమెకు క‌రోనా సోకింది. అప్ప‌టికే కొద్ది రోజులుగా క‌రోనా బాధితుల‌కు వైద్యం అందిస్తోన్న ఆమెకు ఒక రోజు ఉన్న‌ట్టుఉండి నిద్ర‌లో తీవ్ర‌మైన జ్వ‌రం వ‌చ్చింది. త‌న ప‌రిస్థితి అర్థ‌మైన ఆమె మంచం మీద తన పక్కనే నిద్రపోతున్న పిల్లలను ప్రేమగా ఒకసారి తడమబోయి వెంటనే చేతిని వెనక్కు తీసుకుంది. 

 

పాపకు ఎనిమిది, బాబుకు ఆరేళ్లు. మెల్లగా మంచం దిగింది. పిల్లల కోసం దేవుడిని ప్రార్థించింది. పిల్లలకు వీడ్కోలు చెప్పింది. ప్రార్థన చేయడాన్ని, వీడ్కోలు చెప్పడాన్ని వీడియో తీసింది. 'ఈ వీడియోను ఐదేళ్ల తర్వాత నా పిల్లలకు చూపించండి' అని మెసేజ్‌ కూడా పెట్టింది జూలీ.  మార్చిలో క్వారంటైన్‌లోకి వెళ్లిన ఆమె ఇంకా ఇంటికి వెళ్ల‌నే లేదు. త్వ‌ర‌గా నెగిటివ్ వస్తే ఇంటికి వెళ్లి త‌న పిల్ల‌ల‌ను చాడాల‌ని ఆమె ఎంతో ఆతృత ప‌డుతోంది. 

 

మీరు బ‌య‌ట‌కు వ‌చ్చే ముందు పిల్లల కోసం తీసిన వీడియోను ఐదేళ్ల తర్వాత చూపించమనే మెసేజ్‌ ఎందుకు పెట్టారని అడిగినప్పుడు ''అప్పటికైతే నా పిల్లలకు పదమూడేళ్లు, పదకొండేళ్లు వస్తాయి. నేను వాళ్లకు ఏం చెప్పదలుచుకున్నానో వాళ్లు అర్థం చేసుకోగలుగుతారు. నేనే లేకపోతే... నేను చెప్పదలుచుకున్న విషయాన్ని వాళ్లకు ఎవరు చెబుతారు. అందుకే ఈ వీడియో '' అని జూలి చెప్పింది. 

 

దీనిని బ‌ట్టి అమ్మ ప్రేమ గొప్ప‌ద‌నం ఎలా ఉంటుందో మ‌రోసారి అర్థ‌మైంది. ఇక కేర‌ళ‌లో జూలి పుట్టిన రెండేళ్ల‌కే ఆమె త‌ల్లిదండ్రులు అమెరికాకు వ‌ల‌స వెళ్లారు. ఆమె అక్క‌డ వైద్య వృత్తి చ‌దివి అక్క‌డ స్థిర‌ప‌డిపోయారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: