ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో పోరాడుతున్న వారిలో వైద్యులతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. రాత్రింబవళ్లు ప్రజల వారు ఇంటి నుండి బయటకు రాకుండా పరిస్థితి అంతా కంట్రోల్ చేస్తున్నారు. మనిషికి ఆపద సమయంలో నిలబడేది పోలీస్ వ్యవస్థ అని మరోసారి నిరూపిస్తున్నారు. ఎక్కడా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించే విధంగా తమ కుటుంబ సభ్యులను కూడా వదిలి ప్రాణాలను రిస్క్ లో పెట్టి రోడ్డుపై డ్యూటీ చేస్తున్నారు.

 

దీంతో చాలా వరకు సమాజంలో ఉన్న ప్రముఖులు పోలీసులు లేకపోతే మనం బతికి బట్ట కట్టే వారం కాదని అంటున్నారు.  వెండితెరపై హీరోలు అని పిలవబడే వాళ్లు కూడా నిజమైన హీరోలు మేము కాదు పోలీస్ లు అని సెల్యూట్ చేస్తున్నారు. ఇటువంటి పోలీసు వ్యవస్థ పై టాలీవుడ్ ప్రముఖ సంగీత డైరెక్టర్ కోటి ఒక పాట పాడారు. మేము చేయాల్సిన యుద్ధాన్ని మీరు బయట ఉండి చేస్తూ...మా ప్రాణాలను కాపాడుతున్నారని 'ఓ పోలీస్ మీ మేలు మేము మరవం..' అనే పాట పాడారు.

 

ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మంది నెటిజన్లు పోలీసు వ్యవస్థపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కరోనా వైరస్ విషయంలో రోడ్డుపై ఉండి పోలీస్ చేస్తున్న ప్రతి త్యాగాన్ని..రాగాలలో పాడుతూ అదరగొట్టాడు కోటి. జయహో పోలీస్ అంటూ...పాడిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో అనేకమంది వీక్షిస్తున్నారు.  “జయహో పోలీస్ కోటి” అని టైప్ చేస్తే యూట్యూబ్ లో మీరు కూడా వీక్షించవచ్చు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: