ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న  విషయం తెలుసిందే . ఈ వైరస్ను పోరాటం చేయడం ప్రభుత్వానికి ఎంతో సంక్లిష్టంగా మారిపోయింది. ఈ వైరస్ ప్రభుత్వానికి ఒక సవాలు విసురుతుంది అనే చెప్పాలి. ఎన్నో కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రజలందరి ఇంటికే పరిమితం అయ్యేలా చేస్తూ... కరోనా  వైరస్ ను కట్టడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోది. ఎన్నో అంశాలను తెరమీదికి తెచ్చి అమలు చేస్తోంది. మరోవైపు లాక్ డౌన్  సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నిరుపేదలకు చేయూతనిచ్చే విధంగా నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. అయితే ఇది కఠిన నిబంధనలు తీసుకొచ్చిన కఠిన నిబంధనలు అమలు చేసిన  రోజురోజుకు కరోనా  వైరస్ ప్రభావం మాత్రం పెరుగుతోంది

 

 

 ప్రపంచ మహామారి కరోనా  వైరస్ పై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పలు సంస్థలు అండగా నిలుస్తున్నాయి . కరోనా  వైరస్ ద్వారా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ సంసిద్ధంగా ఉంచేందుకు ముందుకు వచ్చి అందరిలో ధైర్యాన్ని నింపుతూన్నాయి. నిన్నటి వరకు టెస్ట్ కిట్లు  పీపీఈ కిట్లు  లాంటివి మెడ్ టెక్ సంస్థ ఆవిష్కరించింది. ఇక ఇప్పుడు  పెరుగుపోతున్న కరోనా విషయంలో   త్వరగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కరోనా  వైరస్ నియంత్రించేందుకు పర్సనల్ ప్రొటెక్షన్ కిట్టు సహా పలు  రకాల  ఇక ఇప్పుడు శ్రీ సిటీ  కరోనా  భద్రత కోసం నడుం బిగించింది. కరోనా  వైరస్పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి అండగా నిలిచింది. 

 

 

 కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరోనా  భద్రత ఉత్పత్తులను చేపట్టేందుకు నడుంబిగించింది శ్రీ సిటీ. భవిష్యత్తులో కరోనా  వైరస్ విజృంభిస్తే ఎలాంటి నీ విపత్తునైనా  ఎదురైనా సంసిద్ధంగా ఉండేలా  ముందస్తు జాగ్రత్తగా బలభద్ర ఉత్పత్తులను రోజులనుండి వారాల సమయం లోనే త్వరగా ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. పర్సనల్  ప్రొటెక్టీవ్  ఎక్విప్మెంట్ , హాస్పిటల్ ఎమర్జెన్సీ బెడ్స్ , లైఫ్ సేవింగ్ కిట్స్  పలు రకాల భద్రత ఉత్పత్తులను అతి తక్కువ వ్యవధిలోనే శ్రీ సిటీ ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అండగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: