లాక్ డౌన్ తో చేతిలో ఉండే ఫోన్ కి విరామం లేకుండా పోయింది. విచ్చల విడిగా నెట్ వినియోగం పెరిగిపోవటమే కాదు...ఆట విడుపు కోసం ఉన్న యాప్ లన్నింటిని డౌన్ లోడ్ చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. లాక్ డౌన్ లో వచ్చే సమస్యలన్నింటికి కూడా యాప్ తో పరిష్కరించుకుంటున్నారు కొందరు. టైం పాస్ కావాలనుకునే వారు ఎంటర్ టైన్ మెంట్ కోసం ఉండే యాప్ ల డౌన్ లోడ్ విపరీతంగా పెరిగిపోయింది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లో ఉన్న వారంతా ఇప్పుడు యాప్ లతోనే కాలం గడిపేస్తున్నారు. అన్ని రంగాల వారికి ఆదాయం పడిపోయినా...వీటికి మాత్రం కొదవ లేదు. ఇక విచ్చల విడియో వాడే వీడియో యాప్...జూమ్ తో ప్రమాదం పొంచి ఉందంటూ కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. బీ అలర్ట్..! అందుబాటులో ఉన్న యాప్ లన్నింటిని వాడితే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

 

లాక్ డౌన్ తో... ఇంటిల్లిపాది... ఇంటికే పనిమితం అయ్యారు. నిత్యం బయటకు తిరగటం అలవాటు పడ్డ జనం ఇంటికే పరిమితం కావాలంటే పెద్ద సమస్య. దీని నుంచి బయట పడటానికి... ఆట విడుపు కోసం యాప్ లను తెగవాడేస్తున్నారు జనం. యాప్ లని వినియోగించటం ఇప్పటికే ప్రజలకు అలవాటు. కానీ ఇప్పుడు వీటి వాడకం విచ్చల విడిగా పెరిగిపోయింది. ప్రధానంగా... ఇప్పుడు అంతా కరోనా భయం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన.. ఆరోగ్య సేత ఆప్ ని ఎక్కువ మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. గడిచిన వారం రోజుల్లోనే ఆరోగ్య సేతు యాప్ ని... 5 కోట్ల 50 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. దీంట్లో ఆరోగ్య సూత్రాలతో పాటు... కరోనా సోకిన వారు  దగ్గరకు వస్తే అలర్ట్ చేస్తుందని... రెడ్ స్పాట్ ఏరియాకు వెళ్తే అలర్ట్ చేస్తుందని ప్రధాని మోడీకి కూడా స్పష్టం చేశారు. ఇది ఈ పాస్ లాగా ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం స్పష్టం చేయటంతో ఆరోగ్యసేతు ని గడిచిన వారం రోజుల్లోనే దేశ వ్యాప్తంగా 5 కోట్ల 50 లక్షల మంది ఈ యాప్ ని డౌన్ లోడ్ చేశారు.

 

లాక్ డౌన్ తో సామాజిక దూరంతో పాటు.. సొంత గ్రామాలకు వెళ్లకుండా పట్టణాలకే పరిమితం అయిన వారు డబ్బుల ట్రాన్ఫర్ కి గూగుల్ పే యాప్ ని తెగ వాడేశారు. బ్యాంకులకు వెళ్లలేని వారు... అవసరానికి డబ్బులు ట్రాన్ఫర్ చేసుకునేందుకు వీలుగా గూగుల్ యాప్ ని వాడారు జనం. లాక్ డౌన్ సీరియస్ గా అమలైనప్పటి నుంచి... గూగుల్ పే ని  2 కోట్ల 20 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది ప్రజల అవసరాలకు అక్కడరకు వచ్చింది. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్న వారిలో ఎక్కువ మందికి వాట్సప్ ఉండే ఉంటుంది. కానీ లాక్ డౌన్ సమయంలో డౌన్ లోడ్ చేసుకున్నవారి సంఖ్య 1కోటి 80 లక్షల మంది. వినోదం పంచుకోవటంతో పాటు.. ఫ్రెండ్స్.., బంధువుల తో గ్రూప్ చాటింగ్...లేదంటే వీడియో కాల్ సదుపాయం కూడా ఉన్న నేపద్యంలో కొత్తగా వాట్సప్ ని కోటీ 80 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇక ఆట విడుపుకోసం...అందరి మొబైల్స్ లో ఇప్పుడు లూడో కింగ్స్ యాప్ దర్శన^మిస్తుంది. ఇది సిటీ... గ్రామం అని తేడా లేకుండా లూడో కింగ్ యాప్ కింగై కూర్చుంది. లూడో కింగ్ యాప్ ని 3కోట్ల80 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇక క్యారమ్ పూల్ ని 2 కోట్ల80 లక్షలు మంది మొబైల్స్ లో భద్రపరుచుకున్నారు. యూ వీడియో యాప్ ని కూడా 2 కోట్ల10 లక్షల మంది డౌన్ చేశారు. ఇక ఇప్పుడు యువత అంతా టిక్ టాక్ కి అలవాటైపోయింది. ఇది మహిళలను కూడా అట్రాక్ట్ చేసింది. లాక్ డౌన్ రోజుల్లోనే ఈ యాప్ ని 2 కోట్ల 60 లక్షల మంది డౌన్ లోడ్ చేశారంటే.... టిక్ టాక్ మోజులో ఎందరు పడ్డారో అర్ధం చేసుకోవచ్చు.

 

లాక్ డౌన్ తో అన్ని విద్యాసంస్ధలు, పరిశ్రమలు.. ఐటీ కంపనీలు అన్నీ మూత పడ్డాయి. అత్యవసరమైన సేవలు మాత్రమే పనిచేశాయి. ఐతే విద్యా సంస్ధలు లాక్ డౌన్ ప్రకటించిన మొదటి వారంలో కాస్త వేచి చూశారు. కానీ...విద్యార్ధులకు సిలబస్ కంప్లీట్ చేయటానికి కార్పొరేట్ కాలేజీలు., పాఠశాలలు.. ఎక్కువగా జూమ్ యాప్ ని ఎంచుకున్నాయి. దీంట్లో విద్యార్ధులకు పాఠాలు చెప్పేశారు. ఇక కార్పొరేట్ ఆఫీసులు.... ఉద్యోగులతో మాట్లాడేదంతా ఈ యాప్ లోనే. అంతెందుకు అత్యవసరమైన ప్రభుత్వ రంగ అధికారులు కూడా ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్ లను కూడా ఈ జూమ్ యాప్ తోనే లాగించేశారు. కేంద్రం ప్రభుత్వ సంస్ధల్లొ కూడా కొందరు అధికారులు ఈ యాప్ తోనే సమావేశాలు జరిపించేశారు. కార్పొరేట్ దిగ్గజాల మద్య జరిగే ఆర్ధిక పరమైన అంశాలు... కేంద్రంలో కీలకంగా ఉండే అధికారులు... శాఖలు కూడా ఈ జూమ్ యాప్ లోనే మంతనాలు జరిపేవారు. ఇలాంటి వెసులుబాటు ఎక్కువ మంది వినియోగించుకునే ప్రయత్నం చేశారు. తాజాగా దీని వాడకం మరింతగా పెరిగింది. గడిచిన 20 రోజుల్లో...జూమ్ యాప్ ని  4 కోట్ల 20 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారంటే... దీని వాడకం ఎంతలా పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు.

 

జూమ్ యాప్ తో ప్రమాదం పొంచి ఉందని..కేంద్ర హోం శాఖ అలర్ట్ చేసింది. ఈ యాప్ లో సమావేశాలు నిర్వహించుకోవటం అంత సేప్ కాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ కార్యాకలాపాల కోసం వాడొద్దని ఆదేశించింది.^సెక్యూరిటీ లోపాలు ఇందులో ఉన్నాయని గుర్తించింది.  కీలకమైన సమావేశాల సందర్భంగా కూడా జూమ్ యాప్ లో సడన్ గా థార్డ్ పర్సన్  ప్రత్యక్షం కావచ్చని హెచ్చరించింది. కీలకమైన అంశాలపై చర్చలు జరిపితే సమాచారాన్ని  సైబర్ నేరగాళ్లు తస్కరించే ప్రమాదం ఉందని తేల్చిచెప్పింది. భారత్ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా ఇప్పటికే హెచ్చరించింది.

 

ఇబ్బడి ముబ్బడిగా నెట్ అందుబాటులో ఉంది కదా... అని యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవటం కాదు. కొన్ని సైట్లతో బ్యాంకు అకౌంట్లకు సంబందించిన సమాచారాన్ని సేకరించటం... సైబర్ నేరగాళ్లతో ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆట విడుపు కాస్తా... జీవితాన్ని కకావికలం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: