దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు బాగానే పెరిగిపోతున్నాయి.  గత నెల ఈ కరోనా దేశంలో ప్రవేశించినప్పటి నుంచి మెల్లి మెల్లిగా దీని ప్రతాపం చూపించుకుంటూ పోతుంది.  మొదట్లో విదేశాల నుంచి వచ్చినవారికి ఈ కరోనా వైరస్ సోకిందని వార్తలు వచ్చాయి... తర్వాత ఢిల్లీలోని ముజాహిద్దీన్ మర్కజ్  ప్రార్థనల్లో పాల్గొన్న వారికి వచ్చినట్లు చెప్పారు.  ఏది ఏమైనా ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 14,378కి చేరగా, ఇప్పటివరకు మొత్తం 480 మంది మృతి చెందారు.

 

ఇప్పటి వరకు కరోనా నుంచి 1,991 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 11,906 మందికి చికిత్స అందుతోంది.  నిన్నటి నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు కాగా, 23 మరణాలు సంభవించాయి. కొన్నిప్రాంతాల్లో కేసులు నమోదు కాకపోవడం ఒక్కటే ఈ సమయంలో ఊరట అని చెప్పాలి. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో కేంద్ర మంత్రుల బృందం భేటీ అయింది.

 

కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఎల్లుండి నుంచి అమలు కానున్న లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతున్నారు. శంలో విద్యా వ్యవస్థను మళ్లీ కొనసాగించాల్సిన తీరు, రైలు సేవల ప్రారంభం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, రామ్‌ విలాస్ పాసవాన్, గిరిరాజ్‌ సింగ్, రమేశ్ పోఖ్రియాల్, సంతోష్ గంగ్వార్ పాల్గొన్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: