ప్రపంచంలో చైనాలోని పుహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ఇప్పటికే 205 దేశాల్లో ప్రజలకు నరకయాతన చూపిస్తుంది. ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో కరోనా బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా అమెరికాలో అయితో కరోనా కరాళ నృత్యం చేసింది.  ఇక్కడ విలయతాండవం చేస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ అక్కడ నిమిషానికి ముగ్గురి చొప్పున ప్రాణాలను బలితీసుకుంటోంది. గత 24 గంట్లలో ఏకంగా 4,591 మంది ఈ మహమ్మారికి బలయ్యారు.  తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 35 వేలు దాటిపోయింది. ఎపిసెంటర్‌గా మారిన న్యూయార్క్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.  

 

అమెరికా ఆర్థిక వ్యవస్థలో రైతుల భాగస్వామ్యం చాలా కీలకం. వారిని అన్ని విధాలా ఆదుకుంటాం అని ట్రంప్ తెలిపారు. విద్యా సంస్థలు మూతపడడం, అమెరికన్లు ఇళ్లకే పరిమితం కావడంతో మార్కెట్‌ పూర్తిగా దెబ్బతింది. ఉత్పత్తులను కొనేవారే లేరు. ఇది ఆహార సరఫరా లింక్‌ను దెబ్బతీసింది. కొనుగోలుదారులు లేక తమ ఉత్పత్తులను రైతులు పంటపొలాల్లోనే నాశనం చేసుకోవాల్సిన దుస్థితి ఎదురయ్యింది. పాల ఉత్పత్తి దారుల పరిస్థితి ఇదే  అని తెలిపారు. కరోనాకు సరైన చికిత్సా విధానం అందుబాటులో లేకపోవడం, లక్షణాలు సైతం కనపడనివ్వకుండా ఆ వైరస్‌ మనిషిలో ఉంటుండం ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో అమెరికా వైద్యులు చేస్తోన్న పరిశోధనల్లో మరో ముందడుగు పడింది.

 

గిలియెడ్‌ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఓ చికిత్సా పద్ధతిని కనిపెట్టింది. తాజాగా మెరుగైన ఫలితాలు ఇస్తుండడంతో అందరి దృష్టి దీనిపై పడింది. అయితే, దీనిపై ఆ సంస్థ మరిన్ని పరిశోధనలు చేస్తోంది. ఓ చికిత్స పద్ధతిని అమెరికాలోని కరోనా రోగులపై ఆ సంస్థ ప్రయోగించగా వారిలో అత్యధిక మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనాతో బాగా బాధపడుతున్న స్టేజ్‌-3 రోగులపై చేసిన ప్రయోగ పరీక్షల ఫలితాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: