అమెరికాలో క‌రోనా విల‌యం పెరుగుతున్న కొద్దీ అధ్య‌క్షుడు ట్రంప్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్య‌క్షుడి అజాగ్ర‌త్త‌ల వ‌ల్లే క‌రోనా దేశంలో ఎక్కువ‌గా విస్త‌రించి ప్రాణ‌న‌ష్టం సృష్టిస్తోంద‌ని మెజార్టీ అమెరిక‌న్ల‌లో అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక లాక్‌డౌన్ విష‌యంలో కూడా తాత్స‌రం చేశాడ‌నే అప‌వాదును ట్రంప్ మూట‌గ‌ట్టుకున్నాడు. తాజాగా  దీంతో న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కువోమో అమెరికా అధ్యక్షుడిపై మండిపడ్డారు. ట్రంప్ టీవీ చూడ‌టం,  మొద్దు నిద్ర మానుకుని దేశం నాశ‌న‌మైపోతోంది..ప‌ట్టించుకో అంటూ కువోమా ధ్వ‌జ‌మెత్తారు. 

 

దేశంలోని బడా వాణిజ్యవర్గాలకు ప్యాకేజీలు అందిస్తూ రాష్ట్రాలకు సహాయం మాట మరిచిన ట్రంప్ ఇకనైనా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించాలని హిత‌వు ప‌లికారు.  దేశంలోని విమానయాన సంస్థలు, ఇతర వాణిజ్య పెట్టుబడిదారులకు బెయిలవుట్ ప్యాకేజ్ అదించిన ట్రంప్ రాష్ట్రాలకు మాత్రం చేయి విదల్చలేదని మండిపడ్డారు.ఇదిలా ఉండ‌గా ఒకవైపు న్యూయార్క్‌లో జ‌నం  పిట్టల్లా రాలిపోతున్నారు. అమెరికాలో క‌రోనాతో చ‌నిపోయిన వారిలో దాదాపు 70శాతం మంది న్యూయార్క్ సిటీకి సంబంధించిన వారే కావ‌డం బాధాక‌రం. అమెరికాలో దాదాపు 7ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

 

వ్యాధిని అదుపు చేయ‌లేని స్థాయికి వెళ్లిపోయింద‌ని జ‌నాలు భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 154,320 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 22.50 లక్షలు దాటింది.  గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా మరో 9,400 మంది మృతిచెందారు. వైరస్ బారినపడ్డవారిలో దాదాపు 5.72 లక్షల మంది కోలుకున్నారు. మరో 15 లక్షల మందిలో స్వల్పంగా వైరస్ లక్షణాలు ఉండగా, 57,130 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. ఇక ఇట‌లీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌లో మ‌ళ్లీ వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టం గ‌మ‌నార్హం.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: