దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎప్పుడు తగ్గుతుందో ఎవరికీ తెలీదు. కొందరు మే నెలాఖరుకు వైరస్ వ్యాప్తి తగ్గుతుందని అంచనా వేశారు. తాజాగా విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కరోనా వైరస్ నియంత్రణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశం గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో చూసిందని.... కరోనా గురించి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. 
 
ప్రపంచాన్ని కాలసర్పదోషం వెంటాడుతుందని.... దుష్ట గ్రహాల ప్రభావం వాల్లే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదని పేర్కొన్నారు. మరో వారం రోజుల్లో గ్రహ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. మే 5వ తేదీ తర్వాత పరిస్థితులు పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తాయని స్వరూపానందేంద్ర వ్యాఖ్యలు చేశారు. వైరస్ చాలా ప్రమాదకరమని... కానీ దేవుని దయ వల్ల వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. 
 
కరోనా వైరస్ ప్రభావం సంవత్సరాల తరబడి ఉండదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి కరోనా వల్ల పెద్దగా చెడు జరగదని పేర్కొన్నారు. మరోవైపు కరోనా కేసుల సంఖ్య 14,378కు చేరింది. వీరిలో 1992 మంది కరోనా నుంచి కోలుకోగా 480 మంది మృతి చెందారు. తెలంగాణలో కేసుల సంఖ్య 766కు చేరగా ఏపీలో కేసుల సంఖ్య 603కు చేరింది. తెలంగాణలోని నాలుగు జిల్లాలలో ఏపీలోని మూడు జిల్లాలలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. 
 
తెలంగాణలో హైదరాబాద్ లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు నిజామాబాద్, వికారాబాద్, సూర్యాపేట్ జిల్లాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వీరిలో అధిక శాతం ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారే కావడం గమనార్హం. ఏపీలోని కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ నెలాఖరుకు ఈ జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పట్టనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: