దేశంలో కరోనా వ్యాప్తి తీరుతెన్నులపై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరాలు తెలిపారు. కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 480కి చేరిందన్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 991 కొత్త కేసులు నమోదయ్యాయని, 43 మంది ప్రాణాలు విడిచారని తెలిపారు.  ప్రపంచ దేశాలన్నింటికి కరోనా మహమ్మారి ఎంతలా వణికిస్తోందో తెలిసిందే. మన దేశంలో కూడా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఈ వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. 23 రాష్ట్రాల్లోని  45 జిల్లాల్లో రెండు వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదని అన్నారు.

 


దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378కి పెరిగిందని, ఇప్పటివరకు 1992 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు లవ్ అగర్వాల్ చెప్పారు.  అయితే లాక్ డౌన్ విషయంలో కొన్ని రాష్ట్రాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నాయని.. ఆ ప్రభావం మరిన్ని రాష్ట్రాలపై పడబోతుందని కేంద్రం ఫైర్ అవుతుంది.  ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంపైకేంద్ర హోంశాఖ మండిపడింది. నిత్యం రద్దీగా ఉంటే “నార్కెల్‌ దంగా” మెయిన్ రోడ్డుపై యథేచ్చగా వాహనాలు వెళ్తుండటంతో పాటుగా.. కోల్‌కత్తాలోని రాజా బజార్, తాప్సియా, గార్డెన్ రీచ్‌తో పాటు సెంట్రల్ కోల్‌కత్తాలో లాక్‌డౌన్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 


దీని సంబందించి ఏప్రిల్ 10వ తేదీన దీదీ సర్కార్‌కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.  శనివారం‘నార్కెల్ దంగా’ రోడ్డును ప్రభుత్వం మూసేసింది. మెయిన్ రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి.. వాహనాలను వెళ్లకుండా మూసేశారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: