దేశంలో కరోనాని పూర్తి స్థాయిలో అరికట్టడానికి సీరియస్ గా లాక్ డౌన్ కొనసాగుతుంది.  అయితే మొన్న 14 వరకు లాక్ డౌన్ ఉన్నా.. దాన్ని మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో రవాణా వ్యవస్థపై 20 తర్వాత కొన్ని మార్గ నిర్దేశాలు జారీచేశారు.  తాజాగా లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్ కు ఫోన్ చేశారు. చేపల ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించాలని అసోం సీఎంను కోరారు. ప్రస్తుతం చేపల ఎగుమతి విషయంలో అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాాచారం.

 

జగన్ విజ్ఞప్తికి అసోం సీఎం శరబానంద సానుకూలంగా స్పందించారు. అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  నిత్యావసర వస్తువుల రవాణాకు సానుకూలంగా ఉన్నట్లు తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి దశలవారీగా ఆంక్షలు సడలించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎల్లుండి సోమవారం నుంచి అనేక సేవలు అందుబాటులోకి రానున్నాయి.

 

ఈ సందర్భంగా ఆయన, ఏపీలో నిలిచిపోయిన అసోం వాసులను ఆదుకోవాలని సీఎం జగన్ ను కోరగా, అన్ని రకాలుగా అండగా నిలుస్తామని సీఎం జగన్ బదులిచ్చారు. ఇదిలా ఉంటే.. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378కి పెరిగిందని, ఇప్పటివరకు 1992 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు లవ్ అగర్వాల్ చెప్పారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: