హైదరాబాద్ – తెలంగాణాకు ఇప్పుడు మరో కొత్త టెన్షన్ ప్రారంభమైంది… హైదరాబాద్, న‌ల్గొండ‌, జిగిత్యాల జిల్లాల‌లోని లోని రొహింగ్యా క్యాంప్ ల‌లో ఉంటున్న పలువురు నిజముద్దిన్ తబ్లిగే జమాతే హాజరయ్యారు.. అలా హాజరైన వారిలో అధిక శాతం మంది ఇప్ప‌టి వ‌ర‌కు తిరిగి క్యాంపుల‌కు చేరుకోలేదు..ఈ విష‌యా‌న్ని కేంద్రం హోంశాఖ గుర్తించింది. ఢిల్లీలోని రోహింగ్యాలు సైతం జమాత్‌ కార్యకలాపాల్లో పాల్గొన్నారని నిఘా వర్గాలు తేల్చాయి.  వారందరినీ గుర్తించి, పట్టుకొని కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. దీంతో అజ్ఞాతంలో ఉన్న రోహింగ్యాలను గుర్తించేందుకు, వారి వివరాలు సేకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.  మూడు కమిషనరేట్‌ల పరిధిలో 6040 మంది రోహింగ్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

 

ఒక్క రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే 5 వేల మంది రోహింగ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెయ్యి మందిని… సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 40 మంది రోహింగ్యాలను పోలీసులు గుర్తించారు.  హైద‌రాబాద్ క్యాంప్ నుంచి 8 మంది, న‌ల్గొండ క్యాంప్ నుంచి 6 గురు, జ‌గిత్యాల క్యాంప్ నుంచి ఒక‌రు ప‌రారైన‌ట్లు గుర్తించారు. తాజాగా వారి కోసం పోలీసులు వేట ప్రారంభించారు.

 

క్యాంప్ నుంచి ఢిల్లీకి వెళ్లి క్యాంప్ నుంచి తిరిగొచ్చిన వారితో పోలీసులు వారి కాంటాక్ట్ ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు… కాగా, ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చిన వారంద‌రూ ఇప్ప‌టికే క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు.  ఎవరైనా యాత్రకు వెళ్లిన వారు ఉంటే స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ క్యాంపుల్ల 40 వేల మంది రోహింగ్యాలు ఉన్నారు. వీరిలో 17,500 మంది యునైటెడ్‌ నేషన్స్‌ హైకమిషనర్‌ ఫర్‌ రెఫ్యూజీలో వివరాలు నమోదు చేసుకున్నారు. 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: