ఆ నిరుపేద త‌ల్లి పోలీసుల‌పై చూపిన ప్రేమ‌కు డీజీపీ స‌వాంగ్‌ చ‌లించిపోయారు... మూడు రోజుల‌క్రితం తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఓ నిరుపేద వృద్ధురాలు ఎండ‌లో బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్న పోలీసులకు కూల్‌డ్రిక్స్ తీసుకువ‌చ్చి ఇవ్వ‌బోయింది.  తాగండి సారు..మీరు పొద్దన‌కా..రాత్ర‌న‌కా ఎప్పుడూ డ్యూటీ చేస్తూనే ఉన్నారంటూ ఎంతో ప్రేమ‌గా ఇవ్వ‌బోయింది. ఆమె మంచి మ‌న‌సుకు పోలీసులు ఎంతో పొంగిపోయారు. నెల‌కు ఎంత సంపాదిస్తావ‌మ్మా అంటూ పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌కు రూ.3500 వ‌ర‌కు అంటూ బ‌దులిచ్చింది. అంత త‌క్కువ సంపాద‌న‌లో కూడా ఎలాంటి సంబంధం లేని పోలీసుల గురించి ఆలోచించి మ‌రీ కూల్‌డ్రిక్స్ తీసుకురావ‌డంపై వారు ఎంతో సంతోషించారు.

 


 తమ కోసం రెండు పెద్ద కూల్ డ్రింక్ బాటిళ్లను తెచ్చిన ఆమె మంచి మనసుకు పోలీసులు ఫిదా అయిపోయారు. మహాతల్లివమ్మా అంటూ కొనియాడారు. రోజుకోసారి కనిపించమ్మా.. మీలాంటి వాళ్ల‌ను చూసే మాకొంచెం ధైర్యంగా ఉంటుంద‌ని ఆ సంద‌ర్భంలో అక్క‌డి సిబ్బంది పేర్కొన్నారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను డీజీపీ స‌వాంగ్ కూడా వీక్షించారు. ఆమెతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌తో ఆదేశించడంతో శ‌నివారం  స్థానిక పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీతో ఆ వృద్ధురాలిని మాట్లాడించారు.


ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ‘‘రెండు రోజుల క్రితం మీ వీడియో సోషల్ మీడియాలో చూశాన‌మ్మా.. అది చూసి  మేం చలించిపోయాం. పోలీసులకు కూల్ డ్రిక్స్ ఇచ్చిన మీ అమ్మతనం మమ్మ‌ల్ని  కదలించింది. ఆ రోజే మీ గురించి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించాను. మీకు ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను, మీరు చూపిన ప్రేమకు సెల్యూట్ చేస్తున్నానమ్మా. మీ లాంటి వాళ్లకే ప్రభుత్వం, పోలీసులు రాత్రింబవళ్లు పని చేస్తున్నాం. మీలాంటి వాళ్లకు రక్షణగా ఉండటం కోసమే పోలీసులు రోడ్ల మీది తిరుగుతూ డ్యూటీ చేస్తున్నారమ్మా’’ అని డీజీపీ ఆమెపై ప్రశంసలు గుప్పించారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: