ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 154,320 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.  అలాగే పాజిటివ్ కేసుల సంఖ్య 22.50 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా మరో 9,400 మంది మృతిచెందారు. వైరస్ బారినపడ్డవారిలో దాదాపు 5.72 లక్షల మంది కోలుకున్నారు. మరో 15 లక్షల మందిలో స్వల్పంగా వైరస్ లక్షణాలు ఉండగా, 57,130 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది.రాకాసి వైరస్ కోరల్లో చిక్కకుని రోజుకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.


 మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచంలో అత్య‌ధికంగా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న దేశాల్లో ఇట‌లీరెండో స్థానంలో ఉంది. అయితే మ‌ర‌ణాలు ఎందుకు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌నే దానిపై అధికారులు అధ్య‌య‌నం చేయ‌గా ఓ కొత్త విష‌యం బ‌య‌ట‌ప‌డిందంట‌. అదేంటంటే...ఇటలీ 60 సంవత్సరాలు వయసు దాటిన వారు దాదాపు 50 శాతానికి పైగా ఉన్నారు. వృద్ధుల‌పై క‌రోనా తొంద‌ర‌గా ప్ర‌భావం చూపుతుండ‌టం, వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి అంత‌గా లేక‌పోవ‌డంతోనే ఈ దేశంలో మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న‌ట్లు అధికారులు గుర్తించారు.

 

కరోనా మహమ్మారి ఐరోపా దేశాలను అతలాకుతులం చేస్తున్నది. ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాల్లో మరణమృదంగం మోగిస్తున్నది. మ‌రోవైపు అమెరికాలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన అగ్రరాజ్యంలో గంట గంటకూ మరణాల సంఖ్య పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. న్యూయార్క్‌లోని పలు ఆస్పత్రుల్లో మృతదేహాలు కుప్ప‌లు తెప్ప‌లుగా ప‌డి ఉండ‌టం గ‌మ‌నార్హం.  ఓ ఆస్పత్రిలో శవాలు గుట్టలుగా పేరుకుపోయినట్లు బయటకు వచ్చిన ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: