వైఎస్ విజయమ్మ.. ఈ పేరును పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.. ఎందుకంటే ఈవిడ ప్రజల గుండెల్లో ఎన్నటికి చెరిగిపోని స్దానాన్ని సంపాదించుకున్న దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ధర్మపత్ని.. ఇదే కాకుండా తెలుగు రాష్ట్రాలు వేరుపడిన తర్వాత ఏపీకి రెండో సీయంగా ఉన్న వై ఎస్ జగన్మోహన్ గారి తల్లి.. తన జీవితంలో ఒక భార్యగా తాను పోషించిన పాత్ర.. ప్రతి మహిళకు ఆదర్శం.. అదే సమయంలో తన భర్తను పోగొట్టుకున్న సమయం నుండి ఇప్పటి వరకు ఒక తల్లిగా తన బాధ్యత మరవలేనిది..

 

 

ఇదే కాకుండా వై.ఎస్.రాజశేఖరరెడ్డి  గారి మరణానంతరం ఫిభ్రవరి 2010 లో జరిగిన ఉపఎన్నికలలో పులివెందుల శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఏకగ్రీవంగా ఎన్నికవడమే కాదు.. తన తనయుడు స్దాపించిన పార్టీలో చేరడానికి 2011 మార్చిలో పులివెందుల శాసనసభ స్థానానికి రాజీనామా చేసారు.. అనంతరం జగన్ పెట్టిన కొత్త పార్టీలో చేరిన తర్వాత వచ్చిన ఎన్నికలలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి సోదరుడు వై.ఎస్.వివేకానందరెడ్డి పై 81,373 తేడాతో విజయం సాధించారు.. ఇదేకాకుండా విజయమ్మ రాజకీయ జీవితంలో ఉన్న విశేషం ఏమిటంటే.. మొదటిసారిగా ఎన్నికైనప్పటి నుండి తాను రాజీనామా చేసే వరకు శాసన సభకు హాజరు అవ్వకపోవడం చరిత్రలో ఓ మైలు రాయి.

 

 

ఇకపోతే 2011 మార్చిలో రెండవ సారి ఎన్నికైన తరువాత అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై జరిగిన అవిశ్వాస తీర్మానంపై తమ ఓటు హక్కుని వినియోగించుకునే నిమిత్తం మొదటి సారిగా శాసనసభకు హాజరైయ్యారు.. ఇదిలా ఉండగా వై ఎస్ ఆర్ గారి జీవితంలో అతని భార్యగా విజయమ్మ గారు ఎలాంటి ముఖ్య పాత్ర పోషించారో రాజశేఖర్ గారే ఓ సందర్బంలో తెలిపారు.. నలభై ఏళ్ళ ఈ నా వివాహ జీవితంలో క్షణం తీరిక లేకుండా నేను తిరుగుతుంటే తను విసుక్కున్న సందర్బం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు కంటికి పాపలా కాచుకోనేది , తన రాకతో నా జీవితంలో కొత్త దశ మొదలయింది.. నేను పెద్దగా షాపింగ్ కూడా చేసేవాడిని కాదు ఎప్పుడు షాపింగ్ కు కూడా వెళ్ళలేదు బట్టల సెలక్షన్ విషయానికి వస్తే అంతా మా ఆవిడ విజయలక్ష్మి చూసుకుంటుంది.. నాకు సంబంధించిన ప్రతి వస్తువూ తానే స్వయంగా కొంటుందని పేర్కొన్నారు..

 

 

ఇక ఒక మహానేత భార్యగా విజయమ్మ పాత్ర ఒక ఎత్తు అయితే కొడుకు జగన్ రెడ్డి విషయం లో ఇంకొక ఎత్తు.. అది ఎలా అంటే ఏ తల్లి తన కొడుకు కష్ట పడుతుంటే చూడలేదు కాని వై ఎస్ రాజశేఖర్ గారు చనిపోవడం ఆ బాధలో నుండి బయట పడక ముందే కాంగ్రెస్ పార్టీ చేసిన నీతి లేని రాజకీయాల నుండి కొడుకు బయట రావడం.. పార్టీ పెట్టడం వెంటనే జైలుకు వెళ్ళడం అన్ని ఇలాంటి కష్టాలే ఒకదాని వెంట మరొకటి ఆమెను చుట్టుముట్టాయి.. అయినా తాను మాత్రం చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో మానసికంగా బలవంతురాలిగా నిలిచింది.. ఆ రోజు వై ఎస్ విజయమ్మ గారి స్థానంలో మరొకరు ఉండుంటే బహుశ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ను ఎదిరించే వారు కాదు కాంగ్రెస్ పార్టీ నుండి బయట వచ్చే వారు కాదు..  ఓదార్పు యాత్ర వుండేది కాదు..

 

 

అంతే కాకుండా కన్న కొడుకు ప్రజలకోసం దీక్షలు అని ధర్నాలు అని ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే ఏ తల్లి ఊరుకుంటుంది.. కానీ విజయమ్మ మాత్రం కొడుకు పడుతున్న కష్టాన్ని చూసి తన బాధను కన్నీరును గుండెల్లో దిగమింగుకుందే కాని ఏ రోజు జగన్ ను ఆపే ప్రయత్నం చెయ్యలేదు జగన్ ప్రజకోసం చేస్తున్న దీక్షలను ధర్నాలను చూసి తల్లడిల్లుతున్న తల్లి ప్రేమను.. ప్రజలు పడుతున్న కష్టాలతో కప్పి పుచ్చిందే కాని ఏ రోజు జగన్ కు అడ్డు చెప్పలేదు.. ఇలా మహా నేత భార్య గా జన నేత తల్లిగా వై ఎస్ విజయమ్మ గారు మరచిపోని విజయాన్ని సొంతం చేసుకుంది..  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి మహా నాయకున్ని రాష్ట్రానికి అందించింది.. ఇకపోతే ఈ రోజు విజయమ్మ గారికి పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: