అగ్రరాజ్యం అమెరికా దుస్థితి చాలా దయనీయంగా మారింది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కల్లా పాజిటివ్ కేసులు విషయంలోనూ, మరణాల విషయంలోనూ అమెరికా మొదటి స్థానంలో ఉంది. రోజుకి కొన్ని వేల పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా, మరోపక్క మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో చాలా వరకు అమెరికన్లు మరియు మీడియా డోనాల్డ్ ట్రంప్ వల్లే అమెరికాకి ఇటువంటి దారుణమైన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. కరోనా వైరస్ దేశంలో ప్రవేశించిన సందర్భంలో ట్రంపు చాలా మూర్ఖత్వంగా వ్యవహరించారని దానికి మేము మూల్యం చెల్లించుకున్నమని అమెరికన్లు అంటున్నారు. ఇటీవల దాదాపు 5వేల మరణాలు ఒక్కరోజులోనే సంభవించడంతో డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై అమెరికన్లు ఒళ్ళు మండిపోయేటట్టు రియాక్ట్ అవుతున్నారు .

 

అసలు ముందే దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటే చాలామంది అంటున్నారు. ముఖ్యంగా న్యూయార్క్ మరియు న్యూజెర్సీ ప్రాంతాలలో కరోనా వైరస్ చాలా భయంకరంగా విజృంభిస్తోంది. అమెరికాలో నమోదవుతున్న మరణాలలో ఎక్కువగా 45 శాతం చనిపోతుంది న్యూయార్క్ ప్రాంతానికి చెందిన వాళ్ళు.

 

అక్కడ వాతావరణం వైరస్ కి సహకరించడంతో మరణిస్తున్న వారి  సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. షాకింగ్ అంశం ఏమంటే.. నిమిషానికి ముగ్గురు చొప్పున.. అంటే ప్రతి ఇరవై సెకన్లకు ఒకరు చొప్పున అమెరికాన్లు మరణిస్తున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో 30 శాతమ ఆఫ్రికన్ అమెరికన్లకే కరోనా సోకటం గమనార్హం. ఇదే పరిస్థితి మరో రెండు నెలల్లో కొనసాగితే దాదాపు లక్ష నుండి రెండు లక్షలకు పైగానే అమెరికన్లు చనిపోతారు అని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: