ఇండియాలో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతూనే వుంది. సంపూర్ణ లాక్ డౌన్ ను విధించిన కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. శనివారం రోజున రాత్రి 9 గంటల వరకు దేశ వ్యాప్తంగా 35,494 శాంపిళ్ల టెస్టులు జరుగగా ఇందులో 2154 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణయ్యింది. తద్వారా ఇప్పటివరకు సింగల్ డే లో 2000కు పైగా కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. మొత్తంగా నిన్న రాత్రి 9 గంటల వరకు ఇండియాలో 16,365 కేసులు నమోదైనట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. 
 
 
 
ఇక ఇప్పటివరకు మహారాష్ట్ర లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కాగా దాంతో పాటు రాజస్థాన్ , గుజరాత్ ,మధ్యప్రదేశ్ లలో కూడా ప్రస్తుతం ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కేసుల తగ్గుదలలో ఏ మాత్రం మార్పు లేకుండా రెండు రాష్ట్రాలు కొనసాగుతున్నాయి. నిన్న ఒక్క రోజే తెలంగాణ లో 43 కేసులు నమోదు కావడంతో  మొత్తంకేసుల సంఖ్య 809కి చేరింది. ఆంధ్రా లో నిన్న 31 కొత్త కేసులు నమోదు కావడం తో కేసులు సంఖ్య 603 కి చేరింది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం తో ఆదివారం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ సమావేశం లో కరోనా కట్టడికి  తీసుకోవాల్సిన చర్యలు అలాగే లాక్ డౌన్  అమలు పై ప్రధానంగా చర్చ జరుగనుంది. అయితే ఏప్రిల్ 20 వ తరువాత లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు వుంటాయని కేంద్రం చెప్పినప్పటికీ తెలంగాణ సర్కార్ మాత్రం మే 3 వరకు పూర్తి లాక్ డౌన్ ను కొనసాగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: